- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sleep mysterries : నిద్రలో సంభవించే ఆకస్మిక పరిణామాలు.. ప్రమాదకరమా?
దిశ, ఫీచర్స్: కంటినిండా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తుంటారు. ప్రతి రోజూ 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా కునుకుతీయాలని సూచిస్తుంటారు. మెంటల్లీ, ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండటానికి ఇది చాలా ముఖ్యం. అయితే నిద్రపోతున్నప్పుడు మనం ఫుల్ రెస్టులో ఉంటాం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఆకస్మిక శారీరక కదలికలు సంభవిస్తుంటాయి. అయితే అలా ఎందుకు జరుగుతుందో నిపుణులు కారణాలు చెప్తున్నప్పటికీ అవి కచ్చితమైనవి కూడా కావని చెప్తున్నారు. ఇప్పటికీ కొన్ని స్లీపింగ్ మిస్టరీస్ ఉన్నాయని పేర్కొంటున్నారు. అవేమిటి? ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.
సడెన్ రియాక్షన్
ఒక్కోసారి డీప్ నిద్రలో ఉన్నాసరే మెదడు సెడన్‌గా యాక్టివ్ అయిపోతుంది. కొందరు ఉలిక్కి పడి మాట్లాడటం, నడవడం, కొన్ని క్షణాలు వింతగా ప్రవర్తించడం వంటివి కూడా చేస్తుంటారు. ఇది చూసినవారు కొందరు దెయ్యం పట్టిందనో, గాలి సోకిందనో కూడా అనుకుంటుంటారు. కానీ అలాంటివేమీ ఉండవని చెప్తున్న నిపుణులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, రోజువారీ అలవాట్లు ఇందుకు కారణం అవుతాయని, అయినప్పటికీ ఇంకా కొన్ని విషయాలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉన్నాయని చెప్తున్నారు.
హిప్నిక్ జెర్క్
కొందరు ఫుల్లు నిద్రలో ఉంటారు. ఒక్కోసారి శరీరాన్ని ఎవరో కుదిపేసినట్టు అనిపిస్తుంది. దీంతో వెంటనే లేచి కంగారు పడుతుంటారు. ఆ క్షణం వింతగా ప్రవర్తిస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో కచ్చితమైన నిర్ధారణలు లేనప్పటికీ శరీరంలోని కండరాలు ఒక్కసారిగా గట్టిగా ముడుచుకుపోవడంవల్ల ఇలాంటి జెర్క్స్ వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, మత్తు పానీయాలు తరచుగా వాడటం, మానసిక ఒత్తిడి వల్ల జర్క్ సంభవిస్తుందని చెప్తున్నారు.
స్లీప్ వాకింగ్
నిద్రలో నడిచే అలవాటు గురించి మీరు వినే ఉంటారు. ఈ సమస్య ఉన్నవారు ఒక్కసారిగా నిద్రలోంచి పైకి లేస్తారు. కళ్లు మూసుకొనే పనులు చేయడం, నడవడం వంటివి చేస్తుంటారు. ఈ సందర్భంలో వీరికి ఏమీ గుర్తుండదు. కుటుంబ సభ్యులో, సంరక్షకులో ఓ కంట కనిపెట్టకపోతే కొన్నిసార్లు ప్రమాదాలు సంభవించవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రిళ్లు లేచి రోడ్డుపై ఏ వాహనాలకో అడ్డుగా వెళ్తేనో, గుంతల్లోనో పడిపోతేనో ప్రాణాలు పోతాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి తీవ్రమైన జ్వరం వల్ల ఇలా జరగవచ్చు. నిద్రకు, నాడీ వ్యవస్థకు ఇబ్బంది కలిగించే కొన్ని రకాల మందుల ప్రభావంవల్ల కూడా కారణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కచ్చితంగా ఇదే కారణం అని చెప్పగలిగే నిర్ధారణలు లేనప్పటికీ హిప్నాసిస్ ప్రక్రియ ద్వారా నిపుణులు చికిత్స అందిస్తారు.
నిద్రలో మాట్లాడటం
బాధితులకు గుర్తుండదు కానీ.. నిద్రలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు. పిల్లల్లో, పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వైద్య పరిభాషలో స్లీప్ టాకింగ్ డిజార్డర్ అంటారు. ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 66 శాతం మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే డైలీ నిద్రలో మాట్లాడతారని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో అలా చేస్తుంటారు. దీనికి శాస్త్రీయ కారణాలంటూ ఏవీ నిర్ధారించకపోయినా ఉదయంపూట ఎదుర్కొన్న అనుభవాలు, జన్యుపరమైన కారణాలు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, డిప్రెషన్ వంటివి స్లీప్ టాకింగ్‌కు కారణం అవుతాయని నిపుణులు చెప్తుంటారు.
స్లీప్ పెరాలిసిస్
భయంకరమైన అనుభవాన్ని నిద్రలో ఉన్నప్పుడు ఎదుర్కోవడంవల్ల ఇది సంభవిస్తుంది. ఎవరో తమపై కూర్చున్నట్లు, ఏదో ఒత్తిడి కలిగిస్తున్నట్లు అనిపిస్తుంది. పైకి లేవడానికి ఇబ్బంది పడతారు. కొందరైతే తమకు దెయ్యం పట్టిందని భ్రాంతి చెందుతారు. స్లీప్ పెరాలిసిస్ కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నిద్రలో పక్షవాతం అనేది తీవ్రమైన మానసిక ఒత్తిడివల్ల ఏర్పడుతుంది. నిద్రలో ఉండగా మెదడలోని మోటార్ కోర్టెక్స్ బాడీకి కదలికలకు సంబంధించిన సిగ్నల్స్ అందించడంలో ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల బాధితులు మేల్కోవడానికి ఇబ్బంది పడతారు.
లూసిడ్ డ్రీమింగ్
బాధితులు తమకు వచ్చిన కలను అనుకూలంగా ఫీల్ అవుతుంటారు. నచ్చినట్లుగా మల్చుకుంటారు. కంట్రోల్ చేసుకుంటారు. ఉదాహరణకు నచ్చిన వ్యక్తితో రొమాన్స్ చేస్తున్నట్లు, నచ్చిన ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు, శత్రువులను కొడుతున్నట్లు కలగనవచ్చు. బ్రెయిన్ ఏరియాస్‌లో మార్పులు, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ వంటి ప్రాంతాల్లో ఒత్తిడి వంటివి ఇందుకు కారణం అవుతున్నాయని చెప్తున్నప్పటికీ అవే కచ్చితమైన కారణాలు కావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
నైట్ టెర్రర్స్
కొందరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా లేచి భయంతో అరుస్తారు. ఇది కలలా కాకుండా ఒక భయంకరమైన అనుభూతిని కలిగిస్తుంది. దీనినే నైట్ టెర్రర్ అంటున్నారు నిపుణులు. రాత్రిళ్లు మాత్రమే ఇవి ఎక్కువగా వస్తుంటాయి. రాత్రి భయాలు, ఇతర పారాసోమ్నియాలు.. పుట్టుకతో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అన్నింటికీ మానసిక బలహీనతలు, ప్రతికూల అనుభవాలతో లింక్ ఉందని నిపుణులు చెప్తున్నారు. కానీ కచ్చితంగా ఏది కారణమో మాత్రం కనుగొనలేదు.
ఎక్స్‌ప్లోడింగ్ హెడ్ సిండ్రోమ్
నిద్రలోకి జారుకుంటారు అనంగానే కొందరికి ఏదో ఒక భారీ వస్తువు పడిపోయినట్లు, ఎవరో బాణా సంచా కాల్చినట్లు, ఇతర భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తుంటాయి. దీనినే ‘ఎక్స్‌ప్లోడింగ్ హెడ్ సిండ్రోమ్’గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది శరీరానికి ఎలాంటి హానీ చేయదు. ఎందుకు వస్తుందో కూడా కచ్చితంగా చెప్పగలిగే సైంటిఫిక్ ఆధారాలు లేవు.
నిద్రలో తినే అలవాటు
తమకు తెలియకుండానే నిద్రలో లేచి ఫ్రిజ్‌లో ఉన్న సాక్స్ తినేస్తుంటారు కొందరు. ఈ పరిస్థితినే స్లీప్ ఈటింగ్ అంటారు. కొన్నిసార్లు తినకూడని పదార్థాలు తింటే ప్రాణాంతకం కావచ్చు. అందుకే బాధితులు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు కనిపెడుతూ ఉండాలి. ఈ సమస్య ఎందుకు వస్తుందో సరైన కారణాలు నిపుణులు కనుగొనలేదు. అలాగే కొందరు నిద్రలో ఉన్నప్పుడు దంతాలను గట్టిగా కొరుకుతుంటారు. ఈ టీత్ గ్రైండింగ్ ప్రాబ్లం కూడా ఎందుకు వస్తుందో తెలియదు.
రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్
నిద్రలో కలలుగనే సమయంలో సాధారణంగా శరీరం కదలకుండా ఉంటుంది. కానీ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ డిజార్డర్ (REM) ఉన్నవారిలో మాత్రం భిన్నమైన ప్రవర్తన ఉంటుంది. ఉదాహరణకు బాధితులు తమను ఓ పాము వెంటాడుతున్నట్లు కలగంటుంటే.. ఆ పరిస్థితికి సంబంధించిన వారి శారీరక ప్రవర్తన బయటకు కనిపిస్తుంది. అంటే వారు పామును కొట్టడానికి ట్రై చేస్తారు. చేతులు కదిలించడం, గట్టిగా అరవడం వంటి కదలికలు ప్రదర్శిస్తారు. చూసేవారికి వారు కలలో ఆందోళన చెందుతున్నారని అనుకుంటారు. కానీ బాధితులకు మాత్రం తెలియదు.