- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్కిప్పింగ్‌తో బెనిఫిట్స్ ఏమిటో తెలుసా?
దిశ, ఫీచర్స్: రోజు స్కిప్పింగ్ చేయడం శారీరక ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అందుకే దీనిని బెస్ట్ కార్డియో ఎక్సర్ సైజ్‌గా పరిగణిస్తారట. ఈ వ్యాయామం వల్ల భవిష్యత్తులో వచ్చే హార్ట్ ఎటాక్‌ను, పక్ష వాతాన్ని నివారించవచ్చు.
స్కిప్పింగ్ (తాడాట)వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. ఇతర అవయవాలను దృఢంగా ఉండేలా చేస్తుంది. అందుకే ఫిట్‌నెస్ నిపుణులు, వైద్య నిపుణులు కూడా దీనిని సజెస్ చేస్తుంటారు. అంతేకాదు రోజు స్కిప్పింగ్ చేయడంతో గుండె జబ్బులు, పక్షవాతంతో పాటు అధిక బరువు సమస్యను ముందుగానే నివారించుకోవచ్చు. ఒకవేళ బరువు పెరిగినా స్కిప్పింగ్ వల్ల తగ్గిపోతుందట. అయితే కొత్తగా చేసేవారు మాత్రం ప్రారంభంలోనే చాలా సేపు చేయాలని ప్రయత్నించవద్దు. క్రమ క్రమంగా స్కిస్పింగ్ సమయాన్ని పెంచుకోవడం, అలవాటు అయ్యాక ఎక్కువ సార్లు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఎముకలు బలపడతాయని, ఊపిరి తిత్తుల సామర్థ్యం మెరుగు పడుతుందని చెప్తున్నారు. అంతేకాదు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు స్కిప్పింగ్ చాలా మంచిది.