- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్మోకింగ్ జోన్ ఉన్నప్పుడు ఆ పని కోసం ప్లేస్ ఎందుకుండదు?!:శ్వేత తివారి
దిశ, వెబ్‌డెస్క్ః మనిషి జీవితంలో ఆకలి చాలా సహజం. హోటళ్లు, బస్టాండ్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఆకలైన వారు ఆహారం కొనుక్కొని, కడుపు నింపుకుంటారు. అలాంటిది ఓ చంటి బిడ్డకు ఆకలేస్తే...? తన తల్లి మాత్రం బహిరంగంగా చనుబాలు ఇచ్చే ధైర్యం చేయలేదు. బిడ్డ ఆకలి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడుస్తున్నా చాటుకు వెళ్లేవరకూ ఓదార్చాలి తప్ప పబ్లిక్‌లో కొంగుతీయదు. అలాచేస్తే చుట్టూ మృగాళ్ల దొంగ చూపులు, అంతకుమించి ఆడోళ్ల సూటీపోటీ మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి సహజమైన చాలా అంశాలు సమాజంలో ఉన్న చెడు భావనల కారణంగా భయానకి లోనయ్యేట్లు పరిణమించాయి. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికల్లో, ఇతరత్రా వేదికలపై తీవ్ర చర్చలే నడుస్తున్నాయి. అభిప్రాయాలైతే సానుకూలంగా కనిపిస్తున్నా ఆచరణలో మాత్రం సంధిగ్థత లేకపోలేదు. తాజాగా, నటి శ్వేతా తివారీ ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు.
"బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలివ్వడం కొందరికి అసౌకర్యంగా ఉంటే, వాళ్లు లేచి వెళ్లిపోవచ్చు" కానీ అలా కాకుండా తల్లి అసౌకర్యానికి లోనుకావడం చింతించాల్సిన విషయం అన్నారామె. "నేనేమీ తప్పు చేయట్లేదు, మందు కొట్టట్లేదు... ఆకలితో ఉన్న నా బిడ్డకు ఆహారం పెడుతున్నాను. ఇది నేనే చేయాల్సిన పని" అని శ్వేత తివారి చెప్పంది. ఎయిర్ పోర్టుల్లో స్మోకింగ్ జోన్స్ ఉంటాయి గానీ బ్రెస్ట్ ఫీడింగ్ జోన్ ఎందుకుండదని ఆమె ప్రశ్నించింది.
శ్వేతా వివాహ జీవితంలో తన ఆత్మగౌరవానికి అనుగుణంగా నడుచుకుంది. టెలివిజన్ కార్యక్రమాల్లో పేరు సంపాదించుకున్న ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.