- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెప్టెంబర్ 26న బధిరుల దినోత్సవం
దిశ, ఫీచర్స్: ప్రపంచ వ్యాప్తంగా వినికిడి సమస్యతో బాధపడుతున్న వారందరికీ ఒక సంఘం ఉండాలన్న ఉద్దేశ్యంతో 1951 సెప్టెంబర్ 26న ఇటలీలోని రోమ్‌లో 'బధిరుల దినోత్సవం(World Deaf Day)'కు రూపకల్పన చేశారు. ఈ అంతర్జాతీయ ప్రభుత్వేతర సెంట్రల్ ఆర్గనైజేషన్‌లో 130 దేశాలకు సభ్యత్వం ఉంది. దేశం, జాతి, మతం, లింగ వివక్ష, ఇతర ప్రాధాన్యాలు, భేదాలు లేకుండా మానవ హక్కులు, గౌరవ మర్యాదలు ఒకేలా ఉండాలన్నది ఈ డే సిద్ధాంతం.
ఈ రోజున బధిరులను ప్రోత్సహించడంతో పాటు వినికిడి సమస్యతో బాధపడుతున్నవారిని గుర్తించి ఉత్తమ విద్య, సమాచారం, ఇతరత్రా సేవలు అందించడం, మానవహక్కులను మెరుగుపరిచే కార్యక్రమాలు చేపడతారు. అంతేకాదు ఈ ఆర్గనైజేషన్ లేనిచోట నెలకొల్పడం, సంకేత భాష నేర్చుకోవడానికి చెవిటి వారికి శిక్షణ ఇవ్వడం, సామాజిక సంబంధాలను మెరుగుపరిచేందుకు దాని ప్రయోజనాలను అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. వీటితో పాటు సాధారణ వ్యక్తిలా జీవించడానికి ఎక్కువ అవకాశాలు కల్పించడం, విద్య, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు సమాన ప్రాప్తి హక్కులను ప్రోత్సహించడమే ఈ ప్రత్యేక రోజు ప్రధాన లక్ష్యాలు.
పాత చీరలతో సస్టెయినబుల్ ఫ్యాషన్..
Health tips: అర్ధ పద్మ పశ్చిమోత్తనాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?