కలయిక లేకుండానే బిడ్డను కనొచ్చు.. అదెలాగంటే !

by samatah |   ( Updated:2023-06-15 07:31:32.0  )
కలయిక లేకుండానే బిడ్డను కనొచ్చు.. అదెలాగంటే !
X

దిశ, ఫీచర్స్ : స్పెర్మ్ అండ్ ఎగ్స్‌తో మానవ పునరుత్పత్తి చేయగల అధునాతన ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) గురించి అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం మరో అద్భుతమైన పురోగతి సాధించారు శాస్త్రవేత్తలు. అదేంటంటే.. స్త్రీ, పురుషుల్లోని ఎగ్స్ అండ్ స్పెర్మ్ కలయికతో సంబంధం లేకుండానే కేవలం మూల కణాలను ఉపయోగించి కృత్రిమ మానవ పిండాలను సృష్టించారు. దీనిద్వారా ఎవరైనా తమకు అవసరమైన బిడ్డను పొందవచ్చు. ఈ ఇంట్రెస్టెంగ్ పరిశోధనా వివరాలను జూన్ 14న బోస్టన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ వార్షిక సమావేశంలోని ప్లీనరీ స్పీచ్‌లో సైంటిస్టులు వెల్లడించారు. ‘‘ఇది హ్యూమన్ మోడల్ అమ్నియన్ అండ్ జెర్మ్ సెల్స్, ఎగ్ అండ్ స్పెర్మ్ యొక్క పూర్వగామి కణాలను(germ cells) నిర్దేశించే మొదటి మూడు-వంశాల మానవ పిండ నమూనా’’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ మాగ్డలీనా జెర్నికా గోట్జ్ పేర్కొన్నారు. ఇది అందంగా పూర్తిగా మూల కణాల ద్వారా క్రియేట్ చేయడిందని వెల్లడించారు.

కృత్రిమ పిండాన్ని మానవ మూలకణాలతో క్రియేట్ చేస్తారు. కాబట్టి దీనికి కొట్టుకునే గుండె లేదా మెదడు ప్రారంభం ఉండదు. అయినప్పటికీ ఇది ప్లాసెంటా, పచ్చసొన, పిండాన్ని ఏర్పరిచే కణాలను కలిగి ఉంటుంది. అయితే ఈ సింథటిక్ మానవ పిండాలు ఎందుకు అవసరమని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తరచుగా గర్భస్రావాలకు సంబంధించిన బయోలాజికల్ ఇష్యూస్‌పై కీలకమైన సమాచారాన్ని అందించడానికి దోహదం చేస్తాయని సైంటిస్టులు అంటున్నారు. గతేడాది ది లాన్సెట్ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 23 మిలియన్ల గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ సింథటిక్ పిండాల డెవలప్‌మెంట్ భవిష్యత్తులో మానవ పునరుత్పత్తి రుగ్మతలపై పరిశోధనలకు, అభివృద్ధి యొక్క ‘బ్లాక్ బాక్స్’ కాలాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుందని చెప్తున్నారు.

Also Read: Manusmriti : నిద్రిస్తున్న స్త్రీతో శృంగారం.. ‘మనుస్మృతి’లో ఏం చెప్పబడింది?

Advertisement

Next Story