319 మిలియన్ సంవత్సరాల నాటి రే ఫిన్డ్ ఫిష్ !

by Prasanna |   ( Updated:2023-02-04 11:06:50.0  )
319 మిలియన్ సంవత్సరాల నాటి రే ఫిన్డ్ ఫిష్ !
X

దిశ, ఫీచర్స్ : రే-ఫిన్డ్ ఫిష్‌‌లలోని మెదడు నిర్మాణం ఇతర సకశేరుకాలలో లేనటువంటి నిర్మాణ లక్షణాలను కలిగి ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. రే చేపలలోని మెదడు‌పై ముందు భాగంలో ఒక కవచం లాంటి నాడీ కణజాలంతో కూడిన భాగం ఉంటుందని, దీనిని ముడుచుకోవడంవల్ల చేప తన తలను లేదా మెదడును రక్షించుకోగలదని నిపుణులు తెలిపారు. అయితే ఈ నాడీ కణజాలం రే చేపల్లో తప్ప ఇతర సకశేరుకాలలో గమనిస్తే కనిపించలేదని, వీటిలో రక్షణ కవచం లోపలే ముడుచుకుని ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఈ విషయం కనుగొనడానికి 319 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజ చేప పుర్రెను నిపుణులు స్కాన్ చేశారు. చేపల అస్థి పంజరాలు, శిలాజాలపై చేసిన తాజా పరిశోధనలతో కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్‌లో కూడా పబ్లిష్ అయ్యాయి. పరిశోధకులు తాజాగా రే ఫిష్ శిలాజంలోని పుర్రె అంతరించిపోయిన కోకోసెఫాలస్ విల్డీకి చెందినదని, వందేళ్ల క్రితం ఇంగ్లాండ్‌లోని బొగ్గు గనిలో ఉండేదని కనుగొన్నట్లు వెల్లడించారు.

యూఎస్‌లోని మిచిగాన్ యూనివర్సిటీ, అలాగే యూకేలోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పుర్రె లోపలి భాగాన్ని పరిశీలించడానికి, అంతర్గత శరీర నిర్మాణం గురించి అధ్యయనం చేయడానికి కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సిటి స్కానింగ్ నాన్‌ డెస్ట్రక్టివ్ ఇమేజింగ్ టెక్నిక్‌ను ఉపయోగించారు. రే-ఫిన్డ్ ఫిష్ అనేది చాలా పురాతన కాలం నాటి చేపల జాతికి చెందినది. ఇది రే అనే అస్థికలను, వెన్నెముకను, రెక్కలను కలిగి ఉంది. చిన్నపాటి నీటి జంతువులను, కీటకాలను వేటాడి తినడానికి ఇది ఉపయోగపడినట్లు నిపుణులు భావిస్తున్నారు. రే-ఫిన్డ్ ఫిష్ మెదడు నిర్మాణం ఇతర సకశేరుకాలలో కనిపించని విధంగా ముడుచుకునే నాడీ కణజాలంతో కూడి ఉంటుంది.

రే ఫిష్ మెదడు, పుర్రె నిర్మాణాలు సకశేరుక పుర్రెలలో కనిపించే లక్షణాలను కలిగి ఉన్నాయి. జఠరికల మాదిరిగానే కపాల నరాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక శిలాజాన్ని చూసి అధ్యయనానికి ఉపక్రమించడం అనేది ఊహించని అన్వేషణ అని అధ్యయన కర్త, రైటర్, సామ్ గైల్స్ పేర్కొన్నారు. పుర్రె గురించి అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు రే ఫిష్ పుర్రె‌లోపల రక్షణ కవచం లాంటి నాడీ కణజాలం కలిగిన మెదడు ఉంటుందని తాము అస్సలు ఊహించలేదని సైంటిస్టు గైల్స్ తెలిపాడు. ''ఇది ఊహించని పరిణామం. నిజంగానే అది మెదడు అని నిర్ధారించుకోవడానికి మాకు కొంత సమయం పట్టింది. శిలాజంలోని మెదడు అనాటమీ చేపలలోని మెదడు పరిణామంపై అవగాహనకు కూడా తోడ్పడుతుంది. గట్టి ఎముకలు, దంతాల మాదిరిగా కాకుండా, సకశేరుకాలలో మెదడు కణజాలం మృదువైనదిగా ఉన్నట్లు కనుగొనడం అనేది అరుదైన విషయం'' అన్నారు.

READ MORE

బెగ్గింగ్ 2.0 : కాలం మారింది.. వీధిలో కాదు ఆన్‌లైన్‌లో అడుక్కుంటున్నారు

Advertisement

Next Story