- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్త్రీతో సంబంధం లేదు.. ఇద్దరు అబ్బాయిలు కూడా పిల్లలను కనొచ్చు..!
దిశ, ఫీచర్స్: మగ కణాలను ఎగ్ సెల్స్‌గా మార్చడం, వాటిని స్పెర్మ్‌తో ఫలదీకరణం చేయడం ద్వారా ఏడు ఎలుకలు జన్మించాయని తెలిపారు పరిశోధకులు. ఈ సాంకేతికత మానవుల్లో స్వలింగ జంటలోని పురుషులు పిల్లలను కలిగి ఉండటానికి అనుమతించగలదని, ఇందుకోసం గర్భాన్ని మోసే సరోగేట్ తల్లి సహాయం తీసుకుంటే సరిపోతుందని వివరించారు. ఆ బిడ్డకు ఒక తల్లి, ఒక తండ్రికి బదులుగా.. ఇద్దరు బయోలాజికల్ ఫాదర్స్ ఉంటారని తెలిపారు.
మగ కణాల నుంచి గుడ్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఇద్దరు జీవసంబంధమైన తండ్రులతో ఎలుకలను సృష్టించారు శాస్త్రవేత్తలు. ఇది ఫెర్టిలిటీకి సంబంధించిన కొత్త అవకాశాలకు కారణమవుతోంది. పునరుత్పత్తికి సంబంధించిన తీవ్రమైన రూపాలకు చికిత్సలకు మార్గం సుగమం చేస్తుంది. ‘మగ కణాల నుంచి బలమైన మామల్ ఓసైట్‌లను తయారు చేయడం ఇదే మొదటి సారి’ అని జపాన్‌లోని క్యుషు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త కట్సుహికో హయాషి తెలిపారు. లండన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లో హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్‌పై థర్డ్ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన డెవలప్‌మెంట్స్‌ను సమర్పించిన హయాషి.. మరో దశాబ్దంలోపు మగ చర్మ కణం నుంచి ఆచరణీయమైన మానవ గుడ్డును రూపొందించడం సాంకేతికంగా సాధ్యమవుతుందని అంచనా వేశారు.
పురుష XY క్రోమోజోమ్ కలయికను మోసుకెళ్లే చర్మ కణాన్ని, స్త్రీ XX వెర్షన్‌తో గుడ్డుగా మార్చడానికి క్లిష్టమైన దశల శ్రేణిపై ఆధారపడింది.
ప్రేరేపిత ప్లూరిపోటెంట్ స్టెమ్ (iPS) కణాలను సృష్టించడానికి మగ చర్మ కణాలు స్టెమ్ సెల్ లాంటి స్థితికి రీప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఈ కణాల Y క్రోమోజోమ్ తొలగించబడింది. రెండు ఒకేలాంటి X క్రోమోజోమ్‌లతో iPS కణాలను ఉత్పత్తి చేయడానికి మరొక సెల్ నుంచి అరువుగా తీసుకున్న X క్రోమోజోమ్ ద్వారా భర్తీ చేయబడింది. అంటే X క్రోమోజోమ్‌ను నకిలీ చేయడానికి ఒక వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నించారు. చివరగా కణాలు అండాశయ ఆర్గానోయిడ్‌లో ఉంచబడ్డాయి. ఇది ఎలుక అండాశయం లోపల పరిస్థితులను ప్రతిబింబించేలా రూపొందించబడిన కల్చరల్ సిస్టెమ్. గుడ్లు సాధారణ స్పెర్మ్‌తో ఫలదీకరణం చేయబడినప్పుడు, శాస్త్రవేత్తలు సుమారు 600 పిండాలను పొందారు. వీటిని సర్రోగేట్ ఎలుకలలో అమర్చారు. ఫలితంగా ఏడు ఎలుక పిల్లలు పుట్టాయి. సాధారణ స్త్రీ-ఉత్పన్న గుడ్లతో సాధించే సామర్థ్యం కంటే దాదాపు 1% సామర్థ్యం తక్కువగా ఉండగా.. ఇక్కడ 5% పిండాలు ప్రత్యక్ష జన్మనిచ్చాయి. శిశువు ఎలుకలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు సాధారణంగా పెరుగుతున్నట్లు కనిపించాయని తెలిపారు శాస్త్రవేత్తలు.
Read more: