మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెంచేందుకు పరిశోధనలు..

by sudharani |   ( Updated:2023-04-04 06:21:19.0  )
మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెంచేందుకు పరిశోధనలు..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో లిబిడో(సెక్స్ డ్రైవ్) కోల్పోవడం, దృష్టిలోపం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్రిటన్ పరిశోధకులు టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్యాచ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది విజయవంతమైతే.. పురుషులకు విస్తృతంగా అందుబాటులో ఉండే హార్మోన్‌ను స్త్రీలు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా పురుషులకు అనేక టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీస్ అందుబాటులో ఉన్నాయి. కానీ స్త్రీలకు క్రీమ్స్, జెల్స్ రూపంలో ఉండటం మూలంగా సరైన మోతాదులో తీసుకోవడం కష్టం. ఒకవేళ క్రీమ్స్ వాడినా దుస్తులు, ఉపరితలాలు, ఇతర వస్తువులకు అంటుకుని మరిన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ యూనివర్శిటీ ఆఫ్ వార్విక్‌లో రసాయన శాస్త్రవేత్త డేవిడ్ హాడిల్టన్ స్థాపించిన బ్రిటీష్ కంపెనీ మెధరాంట్ మహిళల కోసం టెస్టోస్టెరాన్ ప్యాచ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో లిబిడోపై ప్యాచ్ ప్రభావాన్ని పరీక్షించిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

Read more:

Brain Stroke: హెమరైజ్ బ్రెయిన్ స్ట్రోక్.. స్ట్రెస్ ఎక్కువైనా రావచ్చు!

Advertisement

Next Story

Most Viewed