చీకటిలో జంతువుల కళ్ళు ఎందుకు మెరుస్తాయో తెలుసా...

by Sumithra |
చీకటిలో జంతువుల కళ్ళు ఎందుకు మెరుస్తాయో తెలుసా...
X

దిశ, ఫీచర్స్ : చీకటిలో ప్రయాణం చేసినప్పుడో, ఇంట్లో చూసినప్పుడో ఆ చీకటిలో జంతువుల కళ్లు లైట్లలా మెరుస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అలా మెరిసే కళ్లను చూసి భయపడే వారు కూడా ఉన్నారు. నిజజీవితంలోనే కాదు టీవీల్లో కూడా రాత్రి సమయంలో అడవుల్లో కనిపించే కొన్ని జంతువుల కళ్లు ఎర్రగా, చింత నిప్పుల్లా, పచ్చని లైట్ గా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. అయితే మనుషుల కళ్లు మాత్రం పగలు, రాత్రి ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాయి. అసలు ఈ జంతువుల కళ్లు మాత్రమే రాత్రి సమయాల్లో ఎందుకు మెరుస్తాయి, దాని వెనుక కారణాలేంటో చాలా మందికి తెలిసి ఉండదు. మరి అలా ఎందుకు మెరుస్తాయి, దాని వెనుక సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చీకటిలో జంతువుల కళ్లు మెరిసేందుకు కారణం వాటి కళ్ళలో ఉండే టేపెటమ్ లూసిడమ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రతిబింబ నిర్మాణం. టేపెటమ్ లూసిడమ్ అనేది జంతువలు కళ్లలో ఉండే మెరుస్తున్న ఒక పొర. ఇది మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఈ పొర కనుగుడ్డులో ఉండే రెటీనాకు వెనుక ఉంటుంది. ఇది కాంతిని ప్రతిబింబిస్తూ వాటి చూపును కాపాడుతుంది. చీకటిలో జంతువుల కళ్లు సరిగ్గా కనిపించేందుకు ఈ పొర ఉపయోగపడుతుంది. అయితే మనుషులకు మాత్రం ఆ ఆప్షన్ లేదు. ఒక వస్తువు పై కాంతి పడి రెటీనా ఫొటో రిసెప్టార్స్ సాయంతో గుర్తించి ఆ ఇమేజ్ ను గుర్తిస్తుంది. అలా ఆ వస్తువు ఏంటో తెలుస్తుంది.

అయితే జంతువుల్లో టేపెటమ్ లూసిడమ్ మిర్రర్ లాంటి పొర రెటీనా వెనకే ఉంటుంది. ఈ పొర చీకటిలో ఉన్న వస్తువుల నుంచి వచ్చే ఫొటో రిసెప్టార్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఫొటో రిసెప్టార్స్ రెటీనాకి చేరుకుంటాయి. దీంతో చీకటిలో ఉన్న వస్తువులు జంతువులకు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే జంతువుల్లో ఈ టేపెటమ్ లూసిడమ్ పొర కనుగుడ్డు బయటికి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ పొర కారణంగానే జంతువుల కళ్లు లైట్లలా మెరుస్తూ కనిపిస్తాయి. కొన్ని సార్లు కొన్ని జంతువుల కంటి రక్తనాళాలు అధికసంఖ్యలో ఉంటే అప్పుడు కళ్ళు ఎరుపు రంగులో మెరుస్తాయి.

Advertisement

Next Story