రాఖీ రోజు అక్కాచెల్లెళ్లు ఇలా చేస్తే.. తమ సోదరులకు మంచి జరుగుతుందంట

by samatah |   ( Updated:2022-08-10 04:53:16.0  )
రాఖీ రోజు అక్కాచెల్లెళ్లు ఇలా చేస్తే.. తమ సోదరులకు మంచి జరుగుతుందంట
X

దిశ, వెబ్‌డెస్క్ : రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఆడపిల్లల మోహంలో ఆనందం వెల్లివిరుస్తుంది. తమ అన్నకు రాఖీ కట్టాలని ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ఇక రాఖీ అంటే రక్షణ అని అర్థం. ప్రతి సోదరి తమ సోదరులు ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుతూ రాఖీ కడుతుంటారు. అనంతర స్వీట్ తినిపించి కుంకుమ పెట్టి దీవిస్తారు. అలాగే సోదరులు కూడా తమ సోదరికి కానుకలిచ్చి మీకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే రాఖీ కట్టే సమయంలో సోదరీమణిలందరూ.. ఈ పని చేస్తే తమ సోదరులందరూ సంతోషంగా ఉంటారంట. అదేమిటంటే ? రక్షాబంధన్ నాడు సోదరుడికి రాఖీ కట్టే ముందు లక్ష్మీదేవిని పూజించాలనే నియమం ఉంది. రాఖీ కట్టే ముందు లక్ష్మీదేవిని పూజించడం వల్ల తోబుట్టువుల జీవితంలో సంతోషం పెరుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామం పఠించడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి సోదరుడు సంతోషంగా, ఆనందంగా ఉండేలా లక్ష్మీ దేవి దీవిస్తుంది అంటారు.

ఏకంగా పెళ్లి పందిట్లోనే అలా చేసిన వధూవరుడు.. షాక్‌లో బంధువులు

Advertisement

Next Story