కిచెన్‌లో రొమాన్స్ చేస్తున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?

by Javid Pasha |
కిచెన్‌లో రొమాన్స్ చేస్తున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : జీవిత భాగస్వాముల మధ్య రొమాన్స్ కామన్. అయితే అది బెడ్ రూమ్ వరకే పరిమితమై ఉంటుందనుకుంటే పొరపాటే. ఆసక్తిని బట్టి పలువురు ఇతర ప్రదేశాల్లోనూ చిలిపి చేష్టలకు పోతుంటారు. పెళ్లైన కొత్తలో అయితే సరదాలు, సరసాలకే మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు కొందరు. పురుషులైతే భార్య కొంగు పట్టుకొని తిరుగుతుంటారనే ‘వెటకారపు ఆరోపణ’లు కూడా అప్పుడప్పుడూ వింటుంటాం. అయితే పెళ్లైన కొత్తలో చాలామంది కిచెన్‌ రూమ్‌‌ను కూడా ఓ మాదిరి ‘రెండవ బెడ్‌ రూమ్’గా యూజ్ చేసుకుంటుంటారు. ఎవరూ లేనప్పుడు ఇక్కడ కూడా చిలిపి చేష్టలతో, రొమాన్స్‌తో రెచ్చిపోతుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం.

* కిచెన్‌లో రొమాన్స్ చేస్తున్నప్పుడు పొరపాటున ప్రమాదాలు జరిగే చాన్స్ ఉంటుంది. అదుపు తప్పి చీర లేదా డ్రెస్ గ్యాస్ స్టవ్‌కి తగిలితే ప్రాణానికి ప్రమాదం. కొందరు సరసాల్లో పడి గ్యాస్ స్టవ్ మీద పెట్టిన పాలు, అన్నం, ఇతర పదార్థాలను మరిచిపోయే చాన్స్ ఉంటుంది. ఆ పదార్థాలు మాడిపోవడం, స్మెల్ రావడం వంటివి జరగవచ్చు.

* కొందరు పురుషులు భార్యకు పనుల్లో సాయం చేయడం పేరుతో కిచెన్‌లోకి వస్తారు. కానీ మధ్య మధ్యలో చిలిపి పనులు చేస్తుంటారు. దీనివల్ల భార్య పనికి, ఏకాగ్రతకు ఆటంకం కలుగుతుంది. కూరగాయలు తరుగుతున్నప్పుడు రొమాన్స్ ప్రమాదకరం. అలాగే వంటకాల్లో ఉప్పు మర్చిపోవడమో, కారం అధికంగా వేయడమో వంటివి జరగవచ్చు.

* వంటగదిని పవిత్రంగా, పరిశుభ్రతకు మారుపేరుగా భావిస్తుంటారు. ఆహార పదార్థాలు ఇక్కడే వండటం, తయారు చేయడం చేస్తుంటారు. కాబట్టి రొమాన్స్ వల్ల నష్టం జరుగుతుంది. సరిగ్గా వండకపోవడం, పరిశుభ్రతలో లోపాలు వంటివి ఏర్పడవచ్చు. కాబట్టి కిచెన్‌లో రొమాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదంటున్నారు నిపుణులు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు, ఇతర వివరాలకు ‘దిశ’ ఎలాంటి బాధ్యత వహించదు.

Advertisement

Next Story

Most Viewed