50 ఏళ్లు దాటిన పురుషులు ఇవి తింటున్నారా.. ఇబ్బందుల్లో పడటం ఖాయం..

by Sumithra |
50 ఏళ్లు దాటిన పురుషులు ఇవి తింటున్నారా.. ఇబ్బందుల్లో పడటం ఖాయం..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : 50 ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో వచ్చే మార్పు చాలా సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న వయస్సుతో ప్రోస్టేట్ గ్రంధి కూడా పెరగడం ప్రారంభమవుతుంది. ప్రోస్టేట్ గ్రంధి మగవారిలో మూత్రనాళాన్ని చుట్టి స్పెర్మ్‌ను కలిగి ఉన్న ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుందంటున్నారు నిపుణులు. దీనిని నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా (BPH) లేదా ప్రోస్టేట్ విస్తరణ అంటారు. ఇది మూత్ర నాళం పై ఒత్తిడి తెచ్చి చిన్నదిగా చేస్తుందట. దీంతో మూత్రాన్ని విసర్జించడానికి మూత్రాశయం మరింత బలవంతంగా సంకోచించేలా చేస్తుంది. దీంతో మూత్ర విసర్జన చేసే విధానాన్ని ప్రభావితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్ విస్తరణ కారణంగా పురుషుల మూత్రాశయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. పెరుగుతున్న వయస్సుతో, శరీరంలోని హార్మోన్ల సమతుల్యత మారి పురుషులలో ప్రోస్టేట్ గ్రంధి పెరుగుతుంది. మరి దీనికి ఎలాంటి నివారణలు ఉన్నాయి, వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

విస్తరించిన ప్రోస్టేట్ లక్షణాలు...

తరచుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు.

మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి

బలహీనమైన మూత్ర ప్రవాహం

మూత్రాశయం ఖాళీ కాలేదనే భావన

మూత్ర విసర్జన చేయడం ప్రారంభించడంలో ఇబ్బంది

మూత్రం ప్రారంభమవుతుంది, ఆగిపోతుంది

రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి తరచుగా లేవాల్సి వస్తుంది.

అలా కాకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు వైద్యనిపుణులు. ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ ఆల్కహాల్, కెఫిన్, కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగాలి.

చక్కెర తీసుకోవడం తగ్గించాలి.

రోజువారీ దినచర్యలో వ్యాయామం చేయాలి.

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం ప్రోస్టేట్ పరిమాణాన్ని పెంచడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా కారణం అవుతుంది.

బర్గర్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి సంతృప్త కొవ్వు పదార్ధాలను తీసుకోవద్దంటున్నారు వైద్య నిపుణులు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story