త్వరగా నడవాలని మీ పాపాయికి బేబీ వాకర్ ఇస్తున్నారా.. అయితే ప్రమాదంలోకి నెట్టినట్టే!

by Jakkula Samataha |   ( Updated:2024-05-02 10:41:50.0  )
త్వరగా నడవాలని మీ పాపాయికి బేబీ వాకర్ ఇస్తున్నారా.. అయితే ప్రమాదంలోకి నెట్టినట్టే!
X

దిశ, ఫీచర్స్ : ఒక బిడ్డకు జన్మించినప్పటి నుంచి ఆ తల్లి తన పిల్లల ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతే కాకుండా ఆ పిల్లవాడు పెరిగి పెద్దగా అవుతుంటే..అతను చేసే అల్లరి, మాట్లాడే ముద్దు ముద్దు మాటలు వింటూ చాలా సంతోషిస్తుంది. అంతే కాకుండా తన పాప లేదా బాబు త్వరగా నడవాలని కోరుకుంటుంది. తొమ్మిది నుంచి పది నెలలు పడే సమయం నుంచే చిన్న చిన్న పాదాలతో బుజ్జి బుజ్జి అడుగులు వేయిస్తూ తెగ సంతోష పడిపోతుంటుంది. అంతే కాకుండా కొంత మంది త్వరగా నడవాలనే ఉద్దేశ్యంతో బేబీ వాకర్స్ కొనుగోలు చేసి ఇస్తుంటారు.

అయితే ఈ బేబీ వాకర్స్ పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయంట. చిన్న వయసులోనే పిల్లలకు బేబీ వాకర్స్ ఇవ్వకూడదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇవి వారి ఆరోగ్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయంట. ఒక్కోసారి వారి ప్రాణాలు కూడా తీయవచ్చు అంటున్నారు నిపుణులు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ విభాగానికి చెందిన హేగే, బేబీ వాకర్ వల్ల చిన్నారి తీవ్రంగా గాయపడిన కేసులను వికాస్ వర్మ ఎప్పటికప్పుడు స్వీకరిస్తూనే ఉన్నారు. బేబీ వాకర్ వల్ల గాయపడిన పిల్లల చేతులు , కాళ్ల ఎముకలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు.

బేబీ వాకర్ వాడిన చాలా మంది పిల్లలు ప్రమాదాల బారినపడ్డారంట. నడుచుకుంటూ వచ్చి తమకు తెలియకుండా ఏదైనా టేబుల్‌కు తల తగలడం.. వంట రూమ్‌లోకి వచ్చి వేడి గిన్నలను ముట్టుకొని కిందపడిపోయి తీవ్రగాయాలపాలు కావడం, త్వర త్వరగా పరిగెత్తుతూ బేబీ వాకర్ పట్టుతప్పి బోల్తాపడి చిన్నారికి దెబ్బలు తాకడం, ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయంట. అంతే కాకుండా 12 నెలలోపు పిల్లలకు బేబీ వాకర్స్ ఇవ్వడం వలన వారి ఎముకలపై ఎఫెక్ట్ పడి వారు త్వరగా నడవలేరంట. అందువలన చిన్న పిల్లలకు బేబీ వాకర్స్ ఇవ్వకూడదని, వారికి నడిచే వయసు వచ్చాక వారు తప్పకుండా నడుస్తారు అంటున్నారు నిపుణులు.

Read More..

పిల్లలను స్కూల్‌కు పంపిస్తే టైం బొక్క??.. ఫోన్ చేతికిచ్చి ఈ తల్లి లెక్క జేస్తే డబ్బే డబ్బు..

Advertisement

Next Story

Most Viewed