- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొడవైన చెవి వెంట్రుకలు.. గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఇండియన్ హెడ్ మాస్టర్
దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అత్యంత పొడవైన చెవి వెంట్రుకలను కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించాడు ఇండియన్ హెడ్ మాస్టర్. 'చెవి వెంట్రుకల గురువు'గా ప్రసిద్ధి చెందిన ఆంటోనీ విక్టర్.. తమిళనాడులోని మధురైకి చెందిన రిటైర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. కాగా తన చెవి వెంట్రుకలు 7.12 అంగుళాలు (18.1 సెంటీమీటర్లు) ఉండటంతో 2007లో ఈ రికార్డ్ క్రియేట్ చేయగా.. ఈ రోజుకు కూడా చెక్కుచెదరకుండా ఉండి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2023లో చేరింది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియా పేజ్ ద్వారా ప్రకటించింది.
ఆంటోనీ విక్టర్ ఫొటో షేర్ చేసిన గిన్సిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు.. 'ప్రపంచంలోనే అత్యంత పొడవైన చెవి వెంట్రుకలను కలిగి ఉన్న ఆంటోనీ విక్టర్ తిరుగులేని రికార్డు సృష్టించాడు. భారతదేశం నుంచి పదవీ విరమణ పొందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడి చెవుల మధ్య నుంచి వెంట్రుకలు పెరిగాయ్. ఇది ఈ సమయంలో 7.12 అంగుళాలుగా ఉంది. విక్టర్ రికార్డు 2007లో మొదటిసారిగా సెట్ చేయబడింది. నేటికీ చెక్కుచెదరకుండా ఉంది' అని ప్రకటించారు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. రికార్డ్ హోల్డర్ గురువును అభినందిస్తూనే.. 'ఈ రికార్డును అధిగమించడమే నా జీవిత లక్ష్యం', 'తదుపరి రికార్డ్ అత్యంత పొడవాటి ముక్కు వెంట్రుకల గురించి ఉంటుందేమో' అని కామెంట్స్ చేస్తున్నారు.
READ MORE
రివ్యూ: జీసస్‌గా మార్చేసే "ఐ యామ్ జీసస్ క్రైస్ట్".. సాతానుతో పోరాడే ఛాన్స్