- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేడిని తట్టుకునేందుకు స్నో బబుల్స్ రిలీజ్ చేస్తున్న జంతువు
దిశ, ఫీచర్స్ : వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మనుషులైతే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుంటారు. కొన్ని పక్షులు చల్లటి ప్రదేశాలకు వలస వెళ్తుంటాయి. మరికొన్ని సరస్సులలో నీటి అంచుల వెంబడి తిరుగుతూ ఉపశమనం పొందుతుంటాయి. కానీ ఆస్ర్టేలియాలో కనిపించే ఎకిడ్నాస్ అనే జంతువు మాత్రం వేడి వాతావరణం నుంచి తనను తాను రక్షించుకోవడానికి తన ముక్కు ద్వారా 'స్నో బబుల్స్' రిలీజ్ చేసుకుంటుందని వెస్ట్రన్ ఆస్ర్టేలియాలోని కుర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
తాజా పరిశోధన ప్రకారం.. ఎకిడ్నాస్ తన ముక్కు ద్వారా రెండు రకాలైన బబుల్స్‌ను రిలీజ్ చేసుకుని శరీరంపై చల్లుకుంటుంది. ఇందులో ఒక రకమైన బబుల్ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసమైతే.. మరో రకమైన బబుల్ తన శరీరంపై పడిన దుమ్మూధూళిని శుభ్రం చేసుకుందుకు తోడ్పడతాయి. ఎకిడ్నాస్ జంతువులోని ఈ ప్రత్యేకతను గుర్తించడానికి ముందు పరిశోధకులు అది తన ముక్కు నుంచి బబుల్స్ వెదజల్లుతున్నప్పుడు ఫొటో తీశారు. దీనివల్ల ఆ తర్వాత అనేకసార్లు స్వయంగా పరిశీలించారు. దీనిద్వారా తేల్చిందేమిటంటే ఎకిడ్నాస్ తన ముక్కునుంచి స్నో బబుల్స్ (మంచు బిందువుల్లాంటి చీమిడి)ను శరీరంపై జల్లుకోవడం వల్ల దాని శరీర అధిక ఉష్ణోగ్రత తగ్గింది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడింది.
పర్యావరణ, శరీరధర్మ శాస్ర్త వేత్త క్రిస్టిన్ కూపర్ (Christine Cooper) తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ''ఎకిడ్నాస్ జంతువు తనను తాను చల్లబర్చుకోవడానికి రిలీజ్ చేసుకునే బబుల్స్‌ను చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇది గొప్ప శీతలీకరణ ప్రక్రియ లాంటిదని అనిపించింది. ఆ జంతువు ముక్కు నుంచి వెలువడిన చల్లటి బబుల్స్ దాని శరీరంలోని ఇతర భాగాల్లోని ఉష్ణోగ్రతకంటే 10 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లదనాన్ని కలిగి ఉన్నాయి'' అన్నారు.
అయితే వేడి వాతావరణాన్ని తట్టుకోవడంలో పలు రకాల జంతువుల్లో వాటి రక్త ప్రసరణ వ్యవస్థ తోడ్పడుతుందని, ముక్కులో నుంచి బబుల్స్ రిలీజ్ చేస్తూ అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే అరుదైన జంతువు ఎకిడ్నాస్ మాత్రమే కావచ్చని పేర్కొన్నారు. అయితే అది 35 డిగ్రీల ఉష్ణోగ్రతవద్ద అది మనగలుగుతుందా అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. కానీ కుర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో మాత్రం ఎకిడ్నాస్ 37.5 డిగ్రీల పరిసర ఉష్ణోగ్రతలోనూ చురుకుగానే ఉంటున్నట్లు తేలింది. పైగా అది హారాన్ని వెతుక్కుంటూ చలాకిగా కనిపించిదట.
ఇవి కూడా చదవండి : Ex Loversవేధిస్తున్నారా? ఇలా రివేంజ్ ప్లాన్ చేయండి!!