- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిల్లల్లో పుట్టుకతోనే వస్తున్న అరుదైన రుగ్మతలు.. కారణం ఇదేనా?
దిశ, ఫీచర్స్ : ప్రపంచ పర్యావరణ సంక్షోభం, వాతావరణ కాలుష్యం పిల్లల్లో మేధో వైకల్యానికి దారితీస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. భూగోళంపై సంభవిస్తున్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో ఏటా 4 మిలియన్లమంది పిల్లలు చిన్న ఏజ్‌లోనే సుమారు 29 అరుదైన రుగ్మతలు లేదా వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా పేర్కొన్నది. మన దేశంలో అయితే ఇప్పటి వరకు పుట్టుకతో శిశువుల్లో వచ్చే 6,900 పైగా అరుదైన వ్యాధులు గుర్తించ బడ్డాయి. వరల్డ్ వైడ్ అయితే 70 మిలియన్ల మంది ప్రజలు అరుదైన రుగ్మతలతో బాధపడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
రీసెంట్ హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ప్రతిరోజూ సుమారు 73 వేలమందికిపైగా పిల్లలు జన్మిస్తుండగా వీరిలో కొంతమంది తక్కువ బరువు, రక్తహీనత, అవయవాల లోపంతో కూడా జన్మిస్తున్నారు. కొందరు ఇన్‌బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజంతో పుడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏటా 20 వేలకంటే ఎక్కుమంది పిల్లలకు స్పెషల్‌గా పౌష్టికాహారం, వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతోపాటు ప్రతి 10 వేలమందిలో ఒకరు లేదా ఇద్దరు శిశువులు అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యువులతో.. అంటే పుట్టుకతోనే అడ్రినల్ హైపర్ ప్లాసియాకు గురవుతున్నారని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరికొందరు శిశువులు గెలాక్టోసేమియా, మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్, ఫెనిల్కెటోనురియా, అలాగే వంశపారంపర్యంగా వచ్చే ఫినైల్‌కెటోనూరియా వంటి అరుదైన వ్యాధులకు గురవుతున్నారు. పర్యావరణ పరిక్షణ, ఆరోగ్యవంతమైన జీవన శైలి, తగిన పోషకాలు లభించే ఆహారం తీసుకోవడం వంటి మార్పులు జరగడమే ఈ సమస్యకు సరైన పరిష్కారంగా నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నింటికి మాత్రం ట్రీట్మెంట్ అవసరం కావచ్చు.