పురుషుల్లో బట్టతల..! డైహైడ్రోటెస్టోస్టెరాన్ అధిక ఉత్పత్తి కారణం..

by srinivas |   ( Updated:2022-09-30 12:16:07.0  )
పురుషుల్లో బట్టతల..!  డైహైడ్రోటెస్టోస్టెరాన్ అధిక ఉత్పత్తి కారణం..
X

దిశ, ఫీచర్స్ : జుట్టు రాలడం అనేది ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా మగవారిలో బట్టతల భయపెడుతుంది. తమ పరువు పోతుందనే ఆందోళనను పెంచుతోంది. ప్రపంచంలోని 70శాతం మంది పురుషులు వేధిస్తున్న ఈ సమస్య.. 20-25 ఏళ్ల వయసులో ప్రారంభమై, 50 సంవత్సరాలకు వచ్చేసరికి పాక్షికంగా లేదా పూర్తిగా జుట్టురాలే పరిస్థితిని ఎదుర్కొనేలా చేస్తుంది.

మగవారి బట్టతల అనేది ప్రధానంగా జన్యుపరమైన స్వభావం కలిగి ఉంటుంది. అంటే కుటుంబానికి ఇరువైపులా ఉండే లోపభూయిష్ట జన్యువులు జుట్టును కోల్పోవడానికి కారణం కావచ్చు. డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వెంట్రుకలు రాలడం సంభవిస్తుంది. వెంట్రుకల కుదుళ్లను తగ్గిస్తూ.. చివరికి అవి తక్కువ మరియు సన్నగా జుట్టును ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇక మేల్ ప్యాటర్న్ బట్టతల(ఆండ్రోజెనెటిక్ అలోపేసియా)ను వేగవంతం చేసేందుకు ఇతర కారకాలు కూడా ఉన్నాయిని చెప్తున్నారు నిపుణులు.

మగవారి బట్టతలకి దారితీసే కారణాలు:

* వృద్ధాప్యం

* పోషకాహారం లేకపోవడం

* ఒత్తిడి మరియు ఆందోళన

* హార్మోన్ల మార్పులు

* దీర్ఘకాలిక వ్యాధులు

* పర్యావరణ కారకాలు

* గుండె జబ్బులు, అధిక రక్తపోటు

* ప్రోస్టేట్ క్యాన్సర్

* మధుమేహం

* ఊబకాయం

* ఇనుము లోపము

* ఎక్సెస్ విటమిన్ ఎ

మగవారి బట్టతల చికిత్స... ఇందుకు గల కారణం, దశపై ఆధారపడి ఉంటుంది. ఆండ్రోజెనెటిక్ అలోపేసియాను గుర్తించడం చాలా సులభం. ఇది హెయిర్‌లైన్ యొక్క కనిష్ట మాంద్యంతో ప్రారంభమై.. జుట్టు పలుచగా ఉండే త్రిభుజాకార ప్రాంతాలపై ఎఫెక్ట్ చూపుతుంది. తర్వాత జుట్టు సన్నగా అయిపోవడం.. అనంతరం జుట్టు రాలడం స్పష్టంగా కనిపించేలా ఉంటుంది. ఇది ముందరి వెంట్రుకల తగ్గుదలకు దారితీస్తుంది. చివరికి పూర్తి నష్టానికి దారితీస్తుంది.

ట్రీట్మెంట్

మగవారి బట్టతలని నిరోధించడానికి ఖచ్చితమైన మార్గం లేదు. కానీ QR678 ఆధునిక చికిత్సల ద్వారా జుట్టు తిరిగి పెరిగే చాన్స్ ఉంది. QR678 మొదటి పేటెంట్ పొందిన, FDA ఆమోదించిన చికిత్సలలో ఒకటి కాగా ఇది జుట్టు రాలడాన్ని అరికట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. QR678 ద్వారా అవసరమైన పోషకాలు, పెప్టైడ్‌లు, ఖనిజాలు మరియు విటమిన్‌ల మిశ్రమం.. నేరుగా జుట్టు కుదుళ్లలోకి అందించబడతాయి. అవసరమైన పోషకాలను జోడించడంతో కుంచించుకుపోతున్న ఫోలికల్‌లను పునరుద్ధరించి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. QR678 అనేది వైద్యపరంగా నిరూపితమైనది. ఎలాంటి నొప్పి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. మగ మరియు ఆడ ఇద్దరికీ జుట్టు రాలడాన్ని నిరోధించడంలో త్వరగా పని చేసే చికిత్స. చికిత్స దాని ప్రభావాలను చూపించడానికి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది.

ఇతర చికిత్సా పద్ధతులు:

* మినాక్సిడిల్ మరియు ఫినాస్టరైడ్ వంటి మందులను ఇండివిడ్యువల్‌గా లేదా సంయుక్తంగా ఉపయోగించడం.

* PRP( ప్లేట్‌లెట్-రిచ్-ప్లాస్మా) :

పీఆర్పీ అనేది హెయిర్ ఫోలికల్స్‌లోని మూలకణాల నుంచి జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి అందించే చికిత్స. ఇందులో రోగి యొక్క రక్తం నుంచి వృద్ధి కారకాలను స్కాల్ప్‌లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది కాస్త గజిబిజిగా ఉండే ప్రక్రియ కాగా QR678 వంటి వేగవంతమైన చికిత్సా విధానాల ద్వారా భర్తీ చేయబడుతోంది.

* హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్:

మగవారి బట్టతల చికిత్సకు చివరి మార్గం. ఈ పద్ధతిలో చురుకైన జుట్టు పెరుగుదల ప్రాంతం నుంచి హెయిర్ ఫోలికల్స్ తీసుకొని.. జుట్టు పెరుగుదల తగ్గుతున్న ప్రాంతాలలో వాటిని రీప్లేస్ చేయడం జరుగుతుంది.

* నైపుణ్యం కలిగిన హెయిర్ స్పెషలిస్ట్ లేదా చర్మవ్యాధి నిపుణుడు చికిత్స ప్రారంభించే ముందు రక్తంతో పాటు అనేక పరీక్షలు చేస్తారు. ఈ చికిత్సతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జుట్టును లాగే హెయిర్ స్టైల్స్ అవాయిడ్ చేయడం, ధూమపానం, జంక్ ఫుడ్‌ను తగ్గించడం ద్వారా పురుషుల బట్టతల చికిత్సకు సహాయపడవచ్చు లేదా బట్టతల రావడం ఆలస్యం కావచ్చు.

ఇవి కూడా చదవండి : 'ఒంటరితనం' ధూమపానం కన్నా ప్రమాదం.. వృద్ధాప్యంతో పోరాడాల్సిందే!

Advertisement

Next Story

Most Viewed