హై బీపీ ఎందుకు వస్తుంది? ఈ తప్పులు మాత్రం చేయకండి..

by Sujitha Rachapalli |
హై బీపీ ఎందుకు వస్తుంది? ఈ తప్పులు మాత్రం చేయకండి..
X

దిశ, ఫీచర్స్ : వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రథమ ప్రధాన కారణంగా ఉంది అధిక రక్తపోటు. గుండె , మెదడు, మూత్ర పిండ సమస్యలను పెంచుతున్న హై బీపీ.. అసలు ఎందుకు వస్తుంది? కారణాలు తెలుసుకుందాం.

ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపించడం ద్వారా రక్తపోటును పెంచుతుంది. క్రమంగా రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల గుండె రక్తాన్ని గట్టిగా పంప్ చేస్తుంది. కాలక్రమేణా రక్తపోటు పెరుగుతుంది.

కెఫిన్ వినియోగం

మితిమీరిన కెఫిన్ వినియోగం సమస్యాత్మకంగా మారుతుంది. ఇది గుండెను ఉత్తేజపరచడం.. రక్తనాళాలు సంకోచించడం ద్వారా రక్తపోటులో తాత్కాలిక పెరుగుదల కనిపిస్తుంది.

అనారోగ్యకర ఆహారం

ప్రాసెస్ చేసిన ఫుడ్, షుగర్, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం అధిక రక్తపోటుకు దోహదం చేస్తుంది. బరువుపెరగడానికి కూడా కారణమవుతాయి. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతాయి.

అధిక ఉప్పు

ఆహారంలో అధిక ఉప్పు శరీరం నీటిని నిలుపుకునేందుకు కారణం అవుతుంది. బాడీలో రక్త పరిణామాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు కారణం. కాగా ఉప్పు తగ్గించడం ద్వారా బీపీని కంట్రోల్ చేయవచ్చని అంటున్నారు నిపుణులు.

ఆల్కహాల్

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం అడ్రినలిన్ పరిమాణం పెరుగుదల.. హై బీపీకి కారణం అవుతుంది. రక్తనాళాలు కూచించుకుపోతాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకోవడం మానుకోమని సూచిస్తున్నారు.

స్మోకింగ్

రెగ్యులర్ స్మోకింగ్ రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది. రక్తపోటుకు దారితీస్తుంది. సిగరెట్ లోని రసాయనాలు ధమనుల దృఢత్వం, అధిక రక్తపోటు ప్రమాదానికి కూడా కారణం అవుతాయి.

శారీరక శ్రమ లేకపోవడం

ఎక్సర్ సైజ్ లేకుండా నిశ్చలమైన జీవన శైలి అధిక బరువు పెరిగేందుకు కారణమవుతుంది. ఇది శరీరంలో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయడం కష్టతరం చేస్తుంది. కాబట్టి సాధారణ శారీరక శ్రమ పూర్తి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed