స్మోకింగ్ మానేస్తే మూడేళ్లలో పెను మార్పులు.. తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే?

by Anjali |   ( Updated:2024-02-16 07:43:10.0  )
స్మోకింగ్ మానేస్తే మూడేళ్లలో పెను మార్పులు.. తాజా అధ్యయనం ఏం చెబుతుందంటే?
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా స్మోకింగ్‌కు బానిసవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సిగరెట్ తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది కూడా. పొగాకులో ఉండే ప్రధానమైన నికోటిన్ అనే రసాయన పదార్థం వ్యసనానికి కారణమైన ఉత్ప్రేరకం. ఈ అలవాటు వల్ల చాలా రకాల క్యాన్సర్లు, హృద్రోగాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.

ప్రస్తుత రోజుల్లో మహిళలు కూడా స్మోక్ చేస్తున్నారు. మహిళలు సిగరెట్ తాగడం వెరీ డేంజరస్ అన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు. స్మోక్ చేయడం వల్ల పుట్టబోయే పిల్లలకు హాని కలుగుతుందని వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ ఒక్కసారి సిగరెట్‌కు బానిపైతే ఎవరి మాటలను లెక్క చేయరు. అయితే సిగరెట్ మానేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని తాజాగా నిపుణులు వెల్లడించారు. ధూమపానం మానేయడం వల్ల 3 సంవత్సరాల తర్వాత ఆయుష్షు విషయంలో పెను మార్పులు జరుగుతాయని తాజా అధ్యయనంలో తేలింది.

ఎన్‌ఇజె‌ఎమ్ ఎవిడెన్స్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో.. 40 సంవత్సరాల లోపు సిగరెట్ మానేసిన వారు స్మోక్ చేయడం అలవాటు లేని వారితో సమానంగా బతకగలరని వెల్లడైంది. మూడేళ్లలో వీరిలో మార్పులు గమనించవచ్చని పేర్కొంది. అలాగే ప్రస్తుతం సిగరెట్ అలవాటు ఉన్నవారు వెంటనే స్మోకింగ్ విడిచిపెడితే వాళ్లు 10 ఏళ్ల తర్వాత ఎప్పుడూ ధూమపానం చేయని వారికి వయస్సుకు దగ్గరగా జీవిస్తారని వెల్లడైంది.

ఈ అధ్యయనంలో యూఎస్, యూకే, కెనడా, నార్వే దేశాలు పాల్గొన్నాయి. దీనిపై 15 ఏళ్లు పరిశోధన చేశారు. ఇప్పటికిప్పుడు స్మోకింగ్ మానేయడం అంటే అస్సలు కానీ పని. కానీ మీ ఆయుష్షును పెంచుకోవాలంటే కచ్చితంగా సిగరెట్ మానేయాల్సిందే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం స్మోక్ చేయడం మానేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

సిగరెట్ మానేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు:

* స్మోక్ చేయడం మానేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

* లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండటం.

* ఆయుష్షు రేటును పెంచుకోవచ్చు.

* మధుమేహం బారిన పడకుండా ఉండటం.

* రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగుపడడం.

* పలు రకాల క్యాన్సర్ల నుంచి తప్పించుకోవడం.

Advertisement

Next Story