వర్క్‌ప్లేస్‌లో ఎమోషనల్ సపోర్ట్ అవసరం.. ఎందుకో తెలుసా?

by samatah |   ( Updated:2023-07-03 06:39:56.0  )
వర్క్‌ప్లేస్‌లో ఎమోషనల్ సపోర్ట్ అవసరం.. ఎందుకో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : వర్క్‌ప్లేస్ స్ట్రెస్‌వల్ల స్త్రీ, పురుషులు సమానంగా మెంటల్ డిజార్డర్స్‌ను ఎదుర్కొంటున్నారని, అవి ఇతర సమస్యలకు దారితీస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే మహిళలు పలు సందర్భాల్లో ఎక్కువగా సఫర్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. పనిచేసే చోటగానీ, సామాజిక, కుటుంబ పరిస్థితుల్లోగానీ స్త్రీలపై ఉండే సాంస్కృతిక అంచనాలు, లింగ వివక్ష, అసమాన వేతనాలు, వర్క్ రెస్సాన్సిబిలిటీ వంటివి వారికి సవాళ్లుగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులను అధిగమించే మార్గాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఓపెన్ కమ్యూనికేషన్

వర్క్ ప్లేస్‌లో ఓపెన్ కమ్యూనికేషన్, పనిలో వైవిధ్యం, మహిళల ఆలోచనలకు విలువనిచ్చే వాతావరణాన్ని సృష్టించాలని మానసిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే కో వర్కర్ల పరిశీలన, పరస్పర సహకారం, హెల్పింగ్ నేచర్ వంటి వాటిని ప్రోత్సహించాలని చెప్తున్నారు. మహిళలు తమ మానసిక ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని పేర్కొంటున్నారు. జడ్జిమెంట్లు లేదా కళంకం గురించి చింతించకుండా మోటివేట్ చేయగలిగే సెషన్లు కూడా ఉండటం మంచిదంటున్నారు.

రిసోర్స్ అండ్ నాలెడ్జ్ సెషన్స్

మహిళల అవసరాలకు ప్రత్యేకంగా సరిపోయే మానసిక ఆరోగ్య సమస్యలపై మార్గదర్శకత్వం ఇచ్చేలా రిసోర్స్ అండ్ నాలెడ్జ్ సెషన్స్ నిర్వహించడం ఆయా సంస్థలకు మేలు చేస్తుందట. వర్క్‌షాప్‌లు, వెబినార్లు లేదా స్ట్రెస్ మేనేజ్‌మెంట్, సెల్ఫ్ కేర్ అండ్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలను చర్చించే గెస్ట్ స్పీకర్‌లను చేర్చవచ్చు. ఈ సెషన్లలో పాల్గొనేందుకు మేల్ ఎంప్లాయీస్‌ను కూడా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. ఇండస్ట్రీ, జాబ్ ఫంక్షన్, వ్యక్తిగత పరిస్థితులు వంటి కారణాలతో మహిళలు వర్క్‌ప్లేస్ ఎన్విరాన్‌మెంట్ ప్రాధాన్యతలను కలిగి ఉండవచ్చు. పలు సర్వేలు కూడా ఇదే వెల్లడిస్తున్నాయి. కాబట్టి పని ప్రదేశంలో మహిళల భద్రత, భరోసా వంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. స్వేచ్ఛ, సౌలభ్యాన్ని అందిస్తూ సహోద్యోగులతో కూడా పరస్పర సహకారం ఉండేలా చూడాలి.

స్వీయ సంరక్షణ

చిన్న సంస్థలు మొదలు కార్పొరేట్ కార్యాలయాల వరకు స్వీయ-సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడం అనేది కాలానుగుణ విరామాలకు సపోర్ట్ చేయడం లాంటిది. అలాగే విశ్రాంతికి, ఫిజికల్ యాక్టివిటీస్‌‌కు అవకాశం ఉండేలా కూడా చూడాలని రిసోర్సింగ్ నిపుణులు చెప్తున్నారు. మెంటల్ హెల్త్ అప్లికేషన్‌లు లేదా టూల్స్, అలాగే యోగ లేదా మెడిటేషన్ కోర్సుల వంటి వెల్నెస్ ప్రోగ్రామ్‌లను ఉద్యోగులందరికీ అందించవచ్చు. వర్క్ హవర్స్ తర్వాత సెషన్‌లకు హాజరు కావడానికి ఇష్టపడని మహిళలకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ విధమైన చర్యలు ఉద్యోగుల్లో మానసిక వ్యాధులకు సంబంధించిన కళంకాన్ని తగ్గించడంలో సహాయపడతాయని, అలాగే సంస్థలకు లాభం జరుగుతుందని చెప్తున్నారు.

Read More: అరటి పండ్లు ఎందుకు వంకరగా ఉంటాయో తెలుసా?

Advertisement

Next Story