- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోర్న్ చూడాలంటే 'పాస్ పోర్ట్' ఉండాల్సిందే!.. కొత్త రూల్స్
దిశ, ఫీచర్స్: 'పోర్నోగ్రఫీ చూడాలనుకుంటున్నారా? అయితే మీ వయస్సు కచ్చితంగా 18 ఏండ్లు దాటి ఉండాలి. అదీ కాక పోర్న్ వీడియోలు చూసేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా 'డిజిటల్ పాస్‌పోర్ట్'ను డౌన్ లోడ్ చేసుకొని ఉండాలి. అది ఉన్నంత మాత్రాన పోర్న్ సైట్స్ ఓపెన్ చేయగానే నేరుగా వీడియోలు చూడలేరు. 'పోర్నోగ్రఫీ పాస్‌పోర్ట్' యాక్సెస్ చేసే సందర్భంలో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే పోర్న్ వీడియో ప్లే అవుతుంది. పోర్నోగ్రఫీ చెడు ప్రభావాల నుంచి పిల్లలను రక్షించడానికి సెప్టెంబర్ నుంచి ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రూల్ ఇది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రజలతో చర్చిస్తోంది.
ఫ్రాన్స్ ప్రతిపాదన
పోర్న్ వీడియోలు చూడటం వల్ల యువతలో లైంగికపరమైన నేర స్వభావం, సెక్సువల్ వాయిలెన్స్ ప్రవృత్తి పెరుగుతోంది. సమాజంలో జరిగే అత్యాచారాలు, హత్యల ఘటనల నేపథ్యంలోనూ ఇది రుజువైంది. అందుకే పోర్న్ సైట్‌లను బ్యాన్ చేయాలనే వాదనలు ప్రపంచవ్యాప్తంగాను కొన్ని దేశాల్లో బలంగా వినిపిస్తున్నాయి. పోర్నోగ్రఫీ ప్రభావంతో ప్రధానంగా మైనర్లు దారితప్పే ప్రమాదం ఉందని, వారిని రక్షించే చర్యలు అవసరమని తాజాగా ఫ్రాన్స్ ఓ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.
ఇందులో భాగంగా ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు పోర్నోగ్రఫీ అందుబాటులో లేకుండా చేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పెద్దలు మాత్రమే పోర్నోగ్రఫీ చూసేందుకు అనుమతిస్తూ 'పోర్నోగ్రఫీ పాస్ పోర్ట్' విధానాన్ని సెప్టెంబర్ నుంచి అమలు చేసే ఆలోచనతో సంబంధిత ప్రతిపాదనను ముందుకు తెచ్చి, దీనిపై చర్చలు జరుపుతున్నామని ఫ్రాన్స్ డిజిటల్ మినిస్టర్ జీన్ నోయెల్ బారట్ (Jean-Noel Barrot) వెల్లడించారు.పోర్న్ వీడియోలు చూడాలనుకునే ప్రతి ఒక్కరూ ఫ్రాన్స్ ప్రభుత్వం రూపొందించిన ఫోన్ అప్లికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా డిజిటల్ సర్టిఫికేట్‌ను, యాక్సెస్ కోడ్‌ను పొందాల్సి ఉంటుందని ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఇండియాలో కరోనా కాలంలో డిజిటల్ సర్టిఫికెట్ల గురించి మనం విన్నాం. కొవిడ్ టీకా తీసుకున్న వారు ప్రత్యేక ప్రభుత్వ యాప్ ద్వారా దీనిని డౌన్ లోడ్ చేసుకున్నారు. అచ్చం ఇలాగే పోర్నోగ్రఫీ విషయంలోనూ ప్రాసెస్ ఉంటుంది. ప్రభుత్వ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ తర్వాత 'పోర్నోగ్రఫీ యాక్సెస్ సర్టిఫికెట్ లేదా పాస్‌పోర్ట్'ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పెద్దలు మాత్రమే ఇంటర్నెట్‌లో పోర్న్ కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరని ఫ్రాన్స్ పేర్కొన్నది.
పోర్న్ పాస్‌పోర్ట్ ఎలా పని చేస్తుంది?
మీరు కొవిడ్ టీకా వేసుకున్నట్లు నిర్ధారించడానికి డిజిటల్ సర్టిఫికెట్ ఎలా అయితే డౌన్ లోడ్ చేసుకున్నారో.. అమెజాన్, మీషో వంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసే క్రమంలో ఏదైనా ఒక వస్తువును బుక్ చేస్తే దానికి సంబంధించిన డిటేల్స్‌తో పాటు కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. అలాగే పోర్నోగ్రఫీని యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్‌కు కూడా యాక్సెస్ కోడ్ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే డిజిటల్ సర్టిఫికెట్ వస్తుంది. చేయాల్సిందల్లా ఇందుకు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అని ఫ్రాన్స్‌కు చెందిన లీ పారిసిన్ (Le Parisien) నివేదికలో పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల 2023 నుంచి పిల్లలు లేదా మైనర్లు పోర్నోగ్రఫీ చూడటం సాధ్యం కాదని తెలిపారు.
ఏజ్ నిర్ధారణ తప్పనిసరి
వివిధ పోర్న్ వెబ్‌సైట్‌లు ఏజ్ నిర్ధారణ ప్రాసెస్‌ను పాటించాలని, అందులో విఫలమైతే వాటిని నిషేధించాలని ఫ్రాన్స్‌కు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అశ్లీల వీడియోలను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరూ వినియోగించని విధంగా ఆయా వెబ్‌సైట్లను నిషేధించిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. ప్రస్తుతం భారతదేశంలో అశ్లీల వీడియోలు చూడటం, వాటిని షేర్ చేయడం, ప్రచారం చేయడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000లోని సెక్షన్ 67B ప్రకారం నేరం. ఎందుకంటే పోర్నోగ్రఫీ అనేది సెక్స్ పరమైన తప్పుడు ధోరణిని ప్రేరేపించి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే అవకాశం ఉంది. తొమ్మిదేండ్ల పిల్లలు కూడా పోర్నోగ్రఫీని చూడటం ఆందోళన కలిగిస్తోందని యూకేకు చెందిన ఒక సర్వే వెల్లడించింది.సోషల్ సైట్లలో
ట్విట్టర్, రెడ్డిట్ ఫీడ్‌లలో కూడా కొన్ని సందర్భాల్లో అశ్లీల కంటెంట్ కనిపిస్తుండటం చూస్తుంటామని కొందరు నిపుణులు పేర్కొన్నారు. చాలా మంది యువకులు (41 శాతం) చూడకూడదని పేర్కొన్న పోర్న్ వెబ్‌సైట్‌లను చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చూడకూడని సెక్సువల్ కంటెంట్‌ను యాక్సెస్ చేశారని ఒక సర్వేలో తేలింది. ఫ్రాన్స్‌లో ప్రస్తుతానికి పోర్న్ పూర్తిగా నిషేధించబడలేదు. వినియోగదారులు పోర్నోగ్రఫీ సైట్లు ఓపెన్ చేసినప్పుడు 'మీ వయస్సు 18 ఏళ్లు పైబడి ఉందని నిర్ధారించడానికి లింక్‌పై క్లిక్ చేయండి' అనేది మాత్రం ప్రత్యక్షమవుతుంది.
కానీ దీన్ని ధృవీకరించడానికి ఎటువంటి ప్రత్యేక యంత్రాంగమూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 15 లేదా అంతకంటే తక్కువ వయస్సు గల పిల్లల్లో మూడింట రెండొంతుల మంది 'ప్రమాదకరమైన అశ్లీల కటెంట్‌ను చూస్తున్నట్లు ఫ్రెంచ్ ప్రభుత్వ నివేదిక పేర్కొన్నది. దీనిని అడ్డుకోకపోతే యువత భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించింది. అందుకే పోర్నోగ్రఫీని పిల్లలకు దూరం చేసేలా ఇంటర్నెట్‌లో 'పోర్నోగ్రఫీ యాక్సెస్ పాస్‌పోర్ట్' విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది.