- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Plants: ఏడుస్తూ అరుస్తున్న మొక్కలు.. నొప్పి, నీటికొరత కారణంగానేనా?
దిశ, ఫీచర్స్: వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాలు సాధించి, రేడియో విజ్ఞాన పితామహుడిగా బిరుదుగాంచిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్.. మొక్కలకు ప్రాణం ఉందని తెలిపాడు. అవి కూడా మనలాగే నొప్పిని అనుభవిస్తాయని వివరించాడు. అయితే తాజాగా మొక్కలు మనుషుల్లాగే బాధ, నొప్పి కలిగినప్పుడు అరుస్తుంటాయని.. ఎమోషన్‌కు తగినట్లుగా వివిధ శబ్దాలు చేస్తాయని సరికొత్త అధ్యయనం తెలిపింది. ‘ఎయిర్‌బోర్న్ సౌండ్స్’ అని పిలువబడే ఈ పరిశోధన.. మొక్కలు, నీరు లేక ఒత్తిడికి గురైనప్పుడు, ఇతర జీవులు వినగలిగేలా అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలను విడుదల చేస్తాయని పేర్కొంది.
ఈ శబ్దాల ఫ్రీక్వెన్సీ మానవులు గుర్తించలేనంత ఎక్కువగా ఉంటాయని.. అయితే కీటకాలు, ఇతర క్షీరదాలు, బహుశా ఇతర మొక్కలు వినవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో పొగాకు, టమోటా మొక్కలను చిన్న పెట్టెల్లో ఉంచి.. 10 సెంటీమీటర్ల గ్యాప్‌లో అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్‌ను అతికించారు శాస్త్రవేత్తలు. వాటికి నొప్పి కలిగించడం, నీరు అందించకపోవడం వల్ల ఒత్తిడికి గురైన మొక్కలు శబ్దాలు చేశాయని, అవి మైక్రోఫోన్ ద్వారా తీసుకోబడ్డాయని చెప్పారు. గుర్తించబడిన శబ్దాలు 20 -250 కిలోహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉండగా.. మానవులు 16 కిలోహెర్ట్జ్ వరకు పౌనఃపున్యాలను మాత్రమే వినగలరని పరిశోధకులు తెలిపారు. మొక్కల మానసిక స్థితిని బట్టి ఈ శబ్దాలలో తేడా ఉంటుందని తెలిపారు.
ఈ రికార్డింగ్‌లు ప్రత్యేక AI అల్గారిథమ్‌ల ద్వారా విశ్లేషించబడ్డాయి. ఇవి మొక్కలు, అవి విడుదల చేస్తున్న శబ్దాల రకాల మధ్య తేడాను గుర్తించగలవు. అధిక ఒత్తిడిని కలిగిన మొక్కలు మరింతగా అరుస్తుండగా.. ఒత్తిడి లేని మొక్కలు సగటున గంటకు ఒకటి కంటే తక్కువ ధ్వనిని విడుదల చేస్తాయి. ఒత్తిడికి గురైన మొక్కలు - నిర్జలీకరణం, గాయాలు రెండూ ఉన్నప్పుడు ప్రతి గంటకు డజన్ల కొద్దీ శబ్దాలను చేస్తాయి.
Read more:
మెడిసిన్ ఎఫెక్టివ్‌గా పనిచేయాలా? అయితే మ్యూజిక్ వింటూ వేసుకోండి