- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Dating Trends : సింగిల్ అయితే చాలు.. ఆ ప్రాంతంలోని యువత చేస్తున్న పని ఇదే !
దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిచయాలు పెంచుకోవడం, డేటింగ్ పార్ట్‌నర్‌ను వెతుక్కోవడం చాలా సింపుల్ అంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికలు, రకరకాల డేటింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక మరింత సులువైపోయింది. ఇండియాలో కొంచెం తక్కువ కానీ.. ఫారెన్ కంట్రీస్‌లో అయితే చాలా మంది యువతీ యువకులు భాగస్వామిని కనుగొనేందుకు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లనే ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. అయితే స్పెయిన్ దేశంలోని ఓ ప్రాంతానికి చెందిన ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా సరికొత్త ట్రెండ్ ఫాలో అవున్నారు.
రొమాంటిక్ పార్ట్‌నర్ కోసం
స్పెయిన్ దేశంలోని మెర్కాడోనా (Mercadona) ప్రాంత ప్రజలు పార్ట్‌నర్‌ను కనుగొనేందుకు సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్‌లను, ఆన్‌లైన్ వేదికలకు ఉపయోగించుకోవడం లేదట. ఆఫ్‌లైన్‌గానే.. అందరినీ ఆకట్టుకునే సరికొత్త పద్ధతిలో వారు తమ భాగస్వాములను కనుగొనే టెక్నిక్ పాటిస్తున్నారు. టిక్ టాక్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో ఈ నయా పోకడలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. పలువురు వీటి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెర్కాడోనాలో ఓ పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఆ ఏరియా ప్రజలు సరుకులన్నీ ఇక్కడే కొంటుంటారు. ఈ క్రమంలోనే వారిలో ఓ సరికొత్త ఆలోచన పుట్టింది. ఏంటంటే.. రొమాంటిక్ భాగస్వామిని లేదా జీవిత భాగస్వామిని వెతుక్కునేందుకు ఈ సూపర్ మార్కెట్‌ను యూజ్ చేసుకుంటున్నారు.
ఏం చేస్తారంటే..
మెర్కాడోనాలోని సింగిల్స్ లేదా ఒంటరిగా ఉంటున్నవాళ్లు రొమాంటిక్ పార్ట్‌నర్‌ను వెతుక్కునే క్రమంలో ఓ సరికొత్త టెక్నిక్ పాటిస్తున్నారు. నచ్చిన వ్యక్తి వద్దకు నేరుగా వెళ్లి డేటింగ్ ప్రపోజల్ పెట్టడానికి, అలాగే ఆన్‌లైన్‌లో వెతకడానికి బదులు వారు ఇక్కడి షాపింగ్ మాల్‌ను యూజ్ చేసుకుంటున్నారు. తమకు భాగస్వామి కావాలనుకునే సింగిల్స్ ఇక్కడి షాపింగ్ కార్ట్‌లో ఓ పైనాపిల్(pineapple)ను తలకిందులుగా పెడతారు. అలా పెట్టిన వ్యక్తి సింగిల్ అని, రొమాంటిక్ రిలేషన్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నారని అర్థం. ఇక్కడి ప్రజలు కూడా అదే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ వ్యక్తి నచ్చితే.. ఆ పైనాపిల్ సిగ్నల్‌కు రియాక్ట్ అవుతారు. అంటే సంబంధానికి ఒకే చెప్పేస్తారు. కాగా ప్రతిరోజూ ఈ డేటింగ్ ప్రక్రియ కొనసాగించడానికి మెర్కాడోనా సూపర్ మార్కెట్‌లో రాత్రి 7 నుంచి 8 గంటల వరకే అవకాశం ఉంటుందట.
పైనాపిల్‌తో అలా..
షాపింగ్ కార్ట్‌లో ఒక వ్యక్తి పైనాపిల్‌ను తలకిందులుగా పెడితే అతను లేదా ఆమె సింగిల్ అని, ఫస్ట్ టైమ్ డేటింగ్ లేదా రొమాంటిక్ భాగస్వామికోసం అలా చేశారని అర్థం. కాబట్టి ఆ వ్యక్తి గనుక నచ్చితే పార్ట్‌నర్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్న అవతలి వ్యక్తి కూడా తమ అంగీకారాన్ని వెరైటీగా తెలియజేస్తారు. ఎలాగంటే.. పైనాపిల్ తల కిందులుగా పెట్టిన వ్యక్తి కార్ట్‌ను, ఆ వ్యక్తితో డేటింగ్‌కు ఇష్టపడిన వ్యక్తి స్మూత్‌గా ఢీకొడతారు. దీంతో మొదట పైనాపిల్ తలకిందులుగా ఉంచిన వ్యక్తి తిరిగి ఆ కార్ట్‌ను బంప్ చేస్తే వారిద్దరికీ ఆసక్తి ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడి వైన్ సెక్షన్‌కు వెళ్లి వివరంగా మాట్లాడుకుంటారు. అనంతరం డేటింగ్ ప్రారంభిస్తారు.
సంబంధాలు - సంకేతాలు
మెర్కాడోనాలోని షాపింగ్ మాల్‌లో ఇంకా కొన్ని రకాల ‘డేటింగ్ ట్రెండ్స్’ కూడా అమలవుతున్నాయని చెప్తారు. ఉదాహరణకు షాపింగ్ కార్ట్‌లో స్వీట్లు లేదా చాక్లెట్లు ఎవరైనా పెడితే ఆ వ్యక్తి కేవలం టెంపరరీ రొమాంటిక్ రిలేషన్‌షిప్ కాకుండా జీవితకాల భాగస్వామిని కోరుకుంటున్నాడని అర్థం చేసుకుంటారు అక్కడి జనం. ఇక పప్పులు, కాలే వంటివి కార్ట్‌లో పెడితే.. వారు ఇతరులతో ఫ్రెండ్‌షిప్ లేదా కొంతకాలం మాత్రమే సంబంధం కోరుతున్నట్లు అర్థం చేసుకోవాలట. అయితే మెర్కాడోనా స్టోర్‌లో ఈ సరికొత్త డేటింగ్ ట్రెండ్‌ను ఫుల్ పాపులర్ చేసిన వ్యక్తి పేరు వివీ లిన్. ఆమె మెర్కాడోనా షాపింగ్ కార్ట్‌లోని విశేషాలను టిక్ టాక్‌లో పంచుకోవడంతో ఈ కొత్త పోకడ గురించి ప్రపంచానికి తెలిసింది.