Physical pains : చలికాలంలో అధికమవుతున్న బాడీ పెయిన్స్.. కారణం ఇదే!

by Javid Pasha |   ( Updated:2024-11-14 14:34:45.0  )
Physical pains : చలికాలంలో అధికమవుతున్న బాడీ పెయిన్స్.. కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : సాధారణ సీజన్లతో పోలిస్తే చలికాలంలో శారీరక నొప్పులు పెరుగుతుంటాయి. వాతావరణ మార్పులు, తేమ శాతం తగ్గడమే ఇందుకు కారణంగా నిపుణులు పేర్కొంటారు. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఫిజికల్ పెయిన్స్ ఎదుర్కొంటున్న వారి సంఖ్య 52 శాతానికి చేరుకుందని ఓ సర్వే పేర్కొన్నది. దీనివల్ల ఈ సీజన్‌లో వ్యాయామాలు చేయడానికి, నిద్రపోవడానికి, ప్రయాణాలు చేయడానికి కూడా పలువురు అవస్థలు పడుతున్నారు.

నిపుణులు ప్రకారం.. చల్లటి వెదర్, వాతావరణ మార్పుల సందర్భంగా ఎక్కువమంది వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి లేదా స్కిన్ కండిషన్స్‌లో మార్పులను ఎదుర్కొంటున్నారు. 35 శాతం మంది ఫిజికల్ పెయిన్ కారణంగా ఎక్సర్‌సైజ్‌లు చేయలేకపోతున్నారు. ఇక ప్రతీ 10 మందిలో ముగ్గురు రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదని, మరో 23 శాతం మంది మెట్లు ఎక్కలేకపోతున్నారని నిపుణులు అంటున్నారు.

ప్రతీ ఐదుగురిలో ఒకరు కూర్చున్న కుర్చీ నుంచి పైకిలేచే క్రమంలో శారీరక నొప్పిని అనుభవిస్తున్నారు. టీవీలు కూడా చూడలేక పలువురు అవస్థలు పడుతున్నారు. పెయిన్ వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడంతో 44 శాతం మంది ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్, డయాబెటిస్, ఊబకాయం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోందని సర్వేను విశ్లేషించిన ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. జీనవ శైలిలో మార్పులు, వైద్యుల సలహాలతో ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఉందంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More ...

Lunch mistakes : లంచ్ టైమ్‌లో చేసే ఈ పొరపాట్లే ఆ సమస్యలకు కారణం.. పరిష్కారమిదిగో





Advertisement

Next Story

Most Viewed