Period Panty: మహిళలకు పీరియడ్ ప్యాంటీలు ఉత్తమ ఎంపిక.. ఇక లీకేజ్ సమస్యలు చెక్

by Anjali |
Period Panty: మహిళలకు పీరియడ్ ప్యాంటీలు ఉత్తమ ఎంపిక.. ఇక లీకేజ్ సమస్యలు చెక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. ప్రతి నెల ఆడపిల్లలు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఆడవాళ్లలో జరిగే ఈ ఋతుస్రావం అనేది సహజమైన జీవ ప్రక్రియ. ఇది సాధారణంగా నెలకు ఒకసారి జరుగుతుంది. రక్తస్రావం కోసం అందరూ ప్యాడ్స్, శ్యానిటరీ న్యాప్‌కిన్లు ఉపయోగిస్తుంటారు. దీంతో కొంతమందికి ర్యాషెస్ వస్తాయి. అధిక రక్తస్రావం కారణంగా లీకేజీ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టేలా తాజాగా పీరియడ్ ప్యాంటీలు అతి తక్కువ ధరకే మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. పీరియడ్ ప్యాంటీలను ఉపయోగిస్తే చాలా కంఫార్ట్‌గా ఉంటుంది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పీరియడ్ ప్యాంటీలు అంటే ఏమిటి..

ఈ పీరియడ్ ప్యాంటీల్లో నాలుగైదు పొరలుంటాయి. చూడానికి ప్యాంటీల్లాగే కనిపిస్తాయి. ఇవి బ్లడ్‌ను ఈజీగా పీల్చుకుంటాయి. సాధారణమైన ప్యాడ్స్‌తో రెండింటితో సమానం ఇవి. మరో ప్యాడ్ వాడాల్సిన పని కూడా ఉండదు. ఉబ్బెత్తుగా, అసౌకర్యంగా ఉండవు. 12 గంటల వరకు ఒక ప్యాడ్ వాడితే సరిపోతుంది. పీరియడ్ ప్యాంటీల్లో ఎక్కువ, తక్కువ ధరలు కలిగి ఉంటాయి. ఎక్కువ నాణ్యత కలిగినవి అయితే అధిక ధరతో పాటు మూడేళ్ల వరకు యూజ్ చేయవచ్చు.

టీనేజ్ పిల్లలకు మేలు చేస్తున్న పీరియడ్ ప్యాంటీలు..

పాఠశాలకు వెళ్లే పిల్లలు పీరియడ్స్ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. తరగతి గది నుంచి వెళ్లి ప్యాడ్ చేంజ్ చేసుకోవడాకి కూడా రిస్క్ అనిపిస్తుంది. కాగా టీనేజ్ పిల్లలకు పీరియడ్ ప్యాంటీలు ఎంతో మేలు చేస్తాయని చెప్పొచ్చు. వీటిలో రక్త స్రావానికి తగ్గట్లు హెవీ, మీడియం, లో ఫ్లో రకాలుంటాయి కాబట్టి స్కూళుకెళ్లే పిల్లలు హ్యాపీగా ఇవి వాడొచ్చు.

పీరియడ్ ప్యాంటీలను శుభ్రపరచడం ఎలా..

పీరియడ్ ప్యాంటీను మళ్లీ మళ్లీ వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు. కానీ అలాంటి అపోహాలు పెట్టుకోకుండా సరైన పద్ధతిలో వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తవని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి యూజ్ చేసిన దాన్ని వాటర్ ఆన్ చేసి ట్యాప్ కింద పెట్టండి. డిటర్జెంట్ తో క్లీన్ చేయండి. మరకలు వదలడానికి నిమ్మకాయ రసం వాడండి.

పీరియడ్ ప్యాంటీతో ప్రయోజనాలు..

దూర ప్రయాణాలు చేసినప్పుడు ఈ పీరియడ్ ప్యాంటీలు వాడితే చాలా సౌకర్యంగా ఉంటుంది. శానిటరీ ప్యాడ్ కన్నా ఇవే మేలు అని చెప్పుకోవచ్చు. ర్యాషెస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే 12 గంటల వరకు ఒకే ప్యాడ్ వాడొచ్చు. బాత్రూమ్స్ అవైలేబుల్‌లో లేకున్నా నో ప్రాబ్లమ్స్. దీర్ఘకాలంగా వాడితే ధర కూడా తక్కువే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story