30 ఏళ్ల నాటి పిండాలతో కవల పిల్లలు.. పేరెంట్స్ కంటే వయసు ఎక్కువే.!

by Hajipasha |   ( Updated:2022-11-23 15:24:25.0  )
30 ఏళ్ల నాటి పిండాలతో కవల పిల్లలు.. పేరెంట్స్ కంటే వయసు ఎక్కువే.!
X

దిశ, ఫీచర్స్: ఒరెగాన్‌కు చెందిన ఒక జంట 30 ఏళ్ల క్రితం ఫ్రోజెన్(ఘనీభవింప) చేసిన పిండాల నుంచి ఇటీవలే కవల పిల్లలను స్వాగతించారు. దీంతో దాదాపు 27 ఏళ్లు స్తంభింపచేసిన పిండం నుంచి 2020లో జన్మించిన మోలీ గిబ్సన్ పేరిట ఉన్న గత రికార్డు బ్రేక్ అయింది. అక్టోబర్ 31న రాచెల్ రిడ్జ్‌వే, ఫిలిప్ రిడ్జ్‌వేలకు జన్మించిన ఈ ఒరెగాన్ కవలలు 'ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శిశువులు'గా రికార్డ్ నమోదు చేశారు.

నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్ ప్రకారం.. ట్విన్స్ 'లిడియా, తిమోతీ రిడ్జ్‌వే' ఇప్పటి వరకు అత్యధిక కాలం ఫ్రోజెన్ చేసిన పిండాల నుంచి పుట్టిన పిల్లలు. వీరిలో ఆడపిల్ల లిడియా 5 పౌండ్ల 11 ఔన్సులు(2.5 కిలోలు), మగబిడ్డ తిమోతీ 6 పౌండ్ల 7 ఔన్సులు(2.92 కిలోలు)తో జన్మించారు.

సాధారణంగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా విజయవంతంగా పిల్లలను పొందిన తర్వాత అదనపు పిండాలను కలిగి ఉన్న తల్లిదండ్రుల నుంచి పిండ దానం ఫలితంగా ఈ పిల్లలు పుట్టారు. ముప్పై ఏళ్ల క్రితం, విట్రో ఫెర్టిలైజేషన్‌ ద్వారా పిల్లలను పొందిన అనామక డోనర్ కపుల్.. సున్నా కంటే 200 డిగ్రీల దిగువన క్రియోప్రెజర్డ్ చేయబడిన పిండాలను దానం చేశారు. ఏప్రిల్ 22, 1992 నుంచి 2007 వరకు వెస్ట్ కోస్ట్ ఫెర్టిలిటీ ల్యాబ్‌లోని కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. ఆ తర్వాత సదరు జంట వీటిని నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్(NEDC)కి విరాళంగా ఇవ్వగా.. పదిహేనేళ్ల తర్వాత ఘనీభవించిన పిండాలు లిడియా, తిమోతీల పుట్టుకకు దారితీశాయి.

రిడ్జ్‌వేస్‌కు ఇప్పటికే 8, 6, 3 & 2 సంవత్సరాల వయసు గల మరో నలుగురు పిల్లల ఉన్నారు. అయితే దానం చేసిన పిండాలను ఉపయోగించడం ద్వారా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని నిర్ణయించుకుని డోనర్స్ కోసం వెతుకుతున్నప్పుడు.. 'ప్రత్యేక పరిశీలన' కేటగిరీ(పిండాల గ్రహీతలను కనుగొనడం కష్టం)లో ఈ పిండాల గురించి తెలిసింది. ఈ సందర్భంగా మనసును కదిలించే విషయం పంచుకున్న రిడ్జ్‌వేస్.. 'ఒక కోణంలో వారు మా చిన్న పిల్లలు అయినప్పటికీ మా కంటే పెద్ద పిల్లలు' అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌‌తో తగ్గుతున్న క్రియేటివిటీ.. ఎలా?

Advertisement

Next Story