- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిద్రలేని రాత్రులు గడుపుతున్న పేరెంట్స్.. అందుకేనట
దిశ, ఫీచర్స్ : ఒక మహిళ తరచూ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మధ్యలో కునుకుతీస్తున్నట్లు మీరు గమనించారా? మరో వ్యక్తి ప్రయాణంలోనో, పగటి వేళనో నిద్రముంచుకొస్తున్నట్లు కనిపించాడా? అయితే అందుకు ప్రత్యేక కారణం కూడా ఉండవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు మొదలు కొని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే యుక్త వయస్కులైన పిల్లలను కలిగిన తల్లిదండ్రుల్లోనే ఎక్కువ ఈ సమస్య ఉంటుందని 2000 పేరెంట్స్‌పై అమెరికన్ చైల్డ్‌కేర్ అండ్ వన్‌పోల్ సంస్థలు ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రతీ ఐదుగురిలో ఇద్దరు తల్లిదండ్రులు రాత్రిపూట నిద్రపోవడానికి కష్టపడుతున్నారని, అలాగే ప్రతీ నలుగురిలో ముగ్గురు విశ్రాంతి, లేదా నిద్రకోసం తహతహలాడుతున్నాని పేర్కొన్నది. దాదాపు 46 శాతం మంది తల్లిదండ్రులు ఎక్కవ భాగం నిద్రలేని రాత్రతులు గడుపుతున్నారని వెల్లడించింది.
పిల్లలు చిన్నవారైనప్పుడు పగలు పడుకొని రాత్రిపూట ఆడుకుంటుంటారు. దీంతో తల్లి లేదా తండ్రి మేల్కోవాల్సి వస్తుంది. ఇక పిల్లలు స్కూలుకెళ్లే వయస్సువారైతే వారికి తినిపించడం, పడుకోబెట్టడం, హోం వర్కు చేయించడం, వారు పడుకున్నాక మరుసటి రోజుకు టిఫిన్లు, భోజనాల ప్రిపరేషన్ పనిలో నిమగ్నమై పోవడంవల్ల చాలామంది తల్లులు రాత్రి 2 గంటల వరకు మేల్కొంటున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొన్నారు. మెట్రోనగరాల్లో అయితే రాత్రిళ్లు అసలే లేటుగా పడుకునే జీవన శైలిని కలిగి ఉంటున్నారని, పైగా పిల్లలను చూసుకోవడంతో మరింత లేట్‌నైట్ ప్రభావం పేరెంట్స్‌పై పడుతోందని చెప్తున్నారు. సర్వే రిపోర్టు ప్రకారం.. 39 శాతం మంది తల్లిదండ్రులు తమ చంటి బిడ్డలు నిద్రవేళ దాటితే, అర్ధరాత్రి దాటినా నిద్రపోరని, వారిని నిద్ర పుచ్చేవరకు మేల్కోవాల్సి రావడంతో తమకు పగలు లేదా పనిలో ఉన్నప్పుడు నిద్ర ముంచుకొస్తూ ఉంటుందని చెప్తున్నారు. మరో 54 శాతం మంది తమ పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు, రాత్రిళ్లు జ్వరంతో బాధపడుతున్నప్పుడు టెన్షన్‌తో నిద్రపోవడం లేదని వెల్లడించారు. ఈ సమయంలో పిల్లలను చూసుకోవడానికి తల్లి, తండ్రి ఇద్దరు కూడా షిఫ్టుల వారీగా తెల్లావార్లూ మేల్కొంటున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. దీంతో అనేకమంది తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఇది వారి ఆరోగ్యంపై కూడా ఎఫెక్టు చూపుతోందని పరిశోధకుడు బ్రెంట్ ఫిస్టర్ అంటున్నారు. తమ పిల్లలకోసం వివిధ పనుల్లో, ప్రిపరేషన్‌లో నిమగ్నమై రాత్రిళ్లు నిద్రపోని పరిస్థితులవల్ల చాలామందికి పగటిపూట నిద్ర ముంచుకొస్తూ ఉంటుందని, మరికొందరు ఏమాత్రం చాయిస్ దొరికినా కునుకు తీస్తుంటారని నిపుణులు చెప్తున్నారు.
Read More..
చాలామంది తమకు ఇష్టమైన ప్రదేశంలోనే కూర్చుంటారు.. ఎందుకో తెలుసా?