Love : మా అమ్మాయిలను ప్రేమించండి ప్లీజ్.. యువతకు ఆ గ్రామస్తుల బంపర్ ఆఫర్ !

by Dishafeatures2 |
Love : మా అమ్మాయిలను ప్రేమించండి ప్లీజ్.. యువతకు ఆ గ్రామస్తుల బంపర్ ఆఫర్ !
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది తల్లిదండ్రులు తమ కూతురు, తాము చూసిన సంబంధం కాకుండా వేరొక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని దాదాపు కోరుకోరు. కొందరైతే లవ్ చేసినప్పటికీ యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా మన దేశంలో ప్రేమ, పెళ్లిళ్ల చుట్టూ అనేక సంప్రదాయ నిబంధనలు అల్లుకుని ఉన్నాయి. మిగతా విషయాల్లో ఏమో కానీ పెళ్లిళ్ల విషయంలో మాత్రం వీటిని తప్పకుండా పాటిస్తారు. కానీ ఒక గ్రామంలోని ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామం పేరే నోయివా డొ కోర్డేరో. ఇది బ్రెజిల్ దేశంలో ఉంది.

అయితే అందరూ ఆశ్చర్యపోయేలా ఒక కొత్త సంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు నోయివా డొ కోర్డేరో గ్రామంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు. ఏంటంటే.. పెళ్లీడుకొచ్చిన తమ కూతుళ్లను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోండి ప్లీజ్ అంటూ యువతకు వింత ప్రపోజల్ పెడుతూ బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. తల్లిదండ్రులే ఇలా చేస్తున్నారంటే అక్కడి అమ్మాయిలు అంత బాగుండరేమో అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ గ్రామంలోని అమ్మాయిలందరూ అందగత్తెలేనట. పైగా బాగా చదువుకొని, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం కలిగి ఉన్నారు. అయితే తమను చేసుకోబోయే వారు కూడా ఇలా అన్ని విషయాల్లో తమకు తగిన వాళ్లే కావాలని కోరుకోవడం, పెళ్లి చూపులకు వచ్చిన వారిలో అలాంటి వారు లేకపోవడంతో ఏ అబ్బాయికీ వెంటనే ఓకే చెప్పక పోవడంతో పెళ్లిళ్లు జరగడం లేదట.

అయితే ఆర్థిక స్థిరత్వం, సమానత్వం వంటి కండిషన్స్ వల్లే తమ కూతుళ్ల పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయని భావించిన నోయివా డొ కోర్డేరో గ్రామస్తులు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే.. తమ కూతుళ్లు ప్రేమలో పడితే, అప్పుడైనా పెళ్లి చేసుకుంటారనే ఉద్దేశంతో ఒక కొత్త పద్ధతిని ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగా వారు తమ గ్రామంలోని పెళ్లి కాని ఆడపిల్లలకు యువకులు ఎవరైనా లవ్ ప్రపోజ్ చేయవచ్చునని, ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చునని బహిరంగంగా ప్రకటించేశారు. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed