గుండెపోటు రాకుండా రక్షించే సాలీడు.. K'gari ద్వీపంలో కనుగొన్న పరిశోధకులు

by Javid Pasha |
గుండెపోటు రాకుండా రక్షించే సాలీడు.. Kgari ద్వీపంలో కనుగొన్న పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు, ఇస్కీమిక్ స్ట్రోక్ ప్రముఖంగా ఉన్నాయి. వీటికి మెడికేషన్స్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే సదరు వ్యక్తి చనిపోయే అవకాశాలే ఎక్కువ. అయితే ఈ ప్రాణాంతక సమస్యను మానవుల్లో ముందస్తుగానే నివారించగలిగే అద్భుతమైన మెడికేషన్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒక విషపు పురుగు నుంచి సేకరించే పాయిజన్ ద్వారా డ్రగ్స్ తయారు చేయడంవల్ల ఇది సాధ్యం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ బయోసైన్స్‌కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు.

ఆస్ట్రేలియాలోని K'gari ద్వీపంలో పరిశోధనలు నిర్వహిస్తున్న సైంటిస్టులు అక్కడ ఒక ప్రాణాంతక ఫ్యూనల్ వెబ్ స్పైడర్‌ను గుర్తించారు. దీనికి Hi1a అనే పేరు పెట్టారు. అయితే ఇదొక విషపు పురుగు అని తెలుసుకొని, దాని విషం ఎలా ప్రభావితం చేస్తుందో అబ్జర్వ్ చేశారు. ఎలుకలపై వివిధ ప్రయోగాలు నిర్వహించారు. కాగా ఈ సందర్భంగా పరిశోధకులను ఆశ్చర్యపర్చిన విషయం ఏంటంటే.. ఈ విషపు సాలీడులోని అణువులు ఎలుకల్లో సంభవించే గుండెపోటు, ఇస్కీమిక్ స్ట్రోక్ సందర్భాల్లో ప్రాణాంతక కణాల నష్టాన్ని సమర్థవంతంగా ఆపగలిగాయి. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా పరిశోధకులు మానవుల్లో గుండెపోటు సంభవించినప్పుడు కూడా హిలా సాలీడు విషపు అణువులను ప్రయోగించి చూశారు. అప్పుడు కూడా సెల్ డెత్‌ను ప్రేరేపించే పరిస్థితులను హిలా నిరోధించింది. అంతేకాకుండా ఇది మెదడులోని కణాలను కూడా రక్షించగలదని కనుగొన్నారు. స్ట్రోక్ ఫలితంగా మెదడు దెబ్బతినడాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఫైనల్ స్టేజ్ ప్రయోగాల తర్వాత దానిని వైద్యపరంగా ఎలా ఉపయోగించవచ్చు ఆలోచిస్తామని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed