నిద్రలో కలలు కంటున్న ఆక్టోపస్‌లు.. రంగులు మార్చేందుకు అదే కారణం!

by samatah |   ( Updated:2023-07-01 07:50:51.0  )
నిద్రలో కలలు కంటున్న ఆక్టోపస్‌లు.. రంగులు మార్చేందుకు అదే కారణం!
X

దిశ, ఫీచర్స్ : ఎనిమిది అవయవాలు కలిగి, రకరకాలుగా రంగులు మార్చే ఆక్టోపస్‌ల గురించి మనకు తెలిసిందే. వాటి ప్రవర్తన కొన్నిసార్లు మానవులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకే జీవశాస్త్రం పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరు వాటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపుతుంటారు. సైంటిస్టులు కూడా వాటి ప్రత్యేకతలపై తమ అధ్యయనాలు కొనసాగిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సహకారంతో ఒకినావా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (OIST) ఆక్టోపస్‌లు నిద్రిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? వాటి మెదడు పనితీరు ఎలా ఉంటుంది?, వాటి చర్మం రంగులు మారడానికి గల కారణాలేమిటి? అనే విషయాలు తెలుసుకునేందుకు పరిశోధనలు నిర్వహించారు.

వాస్తవానికి ఆక్టోపస్‌లు అమేజింగ్ షేప్-షిఫ్టర్స్, తమ చర్మాన్ని వివిధ రకాల పరిమాణంగా మార్చుకోవడంలో తగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. స్మాల్ బంప్స్ నుంచి టాల్ స్పైక్‌ల వరకు శరీరాన్ని అల్లికల మాదిరి క్రియేట్ చేసుకుంటాయి. శరీర ఆకారాన్ని, రంగును మార్చుకోవడంవల్ల మనకు వివిధ ఆకారాల్లో, రంగుల్లో దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా అవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు లేదా తమకు ముప్పు ఉందని భావించినప్పుడు రంగులు మార్చుకుంటాయని పరిశోధకులు చెప్తున్నారు. వీటిలో రంగు మార్చే లక్షణం చాలా ప్రత్యేకమైందని, దాదాపు అన్ని సెఫలోపాడ్‌ల ద్వారా ఇది భాగస్వామ్యం చేయబడుతుందని అంటున్నారు. అయితే ఆక్టోపస్‌లలో మాత్రం ఈ నైపుణ్యం ఉత్కంఠభరితంగా ఉంటుందట. ఎందుకంటే అవి హయ్యెస్ట్ రిజల్యూషన్ నమూనాలను కలిగి ఉంటాయి. మేల్కొన్నప్పుడు ఎదుర్కొనే అనేక రకాల అనుభవాలను అవి నిద్రలో స్మరించుకుంటూ కలలు కంటాయని, భద్రతకోసం రంగులు మారాలని భావిస్తాయని పరిశోధకులు గుర్తించారు. దీనికనుగుణంగా వాటి మెదడు కార్యకలాపాలు జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. అవి భావించినట్లుగా, కలలు కన్నట్లుగా రంగులు మారే అద్భుతమైన భౌతిక ప్రక్రియలను కొనసాగించే శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అదే వాటి ప్రత్యేకత అని సీనియర్ పరిశోధకుడు ప్రొఫెసర్ సామ్ రైటర్ అంటున్నారు.

Read More: ఉదయాన్నే భార్యతో భర్త చేయాల్సిన పనులు ఇవేనంట?

Advertisement

Next Story

Most Viewed