విడాకుల వేడుక, డివోర్స్ రింగ్స్.. వైవాహిక బంధంలో ఏమిటీ నయా ట్రెండ్ ?

by Dishafeatures2 |
విడాకుల వేడుక, డివోర్స్ రింగ్స్.. వైవాహిక బంధంలో ఏమిటీ నయా ట్రెండ్ ?
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ అమెరికన్ మోడల్, నటి ఎమిలీ రతాజ్ కోవ్‌స్కీ( Emily Ratajkowski) రీసెంట్‌గా తాను ధరించిన ‘డివోర్స్ రింగ్స్’ పిక్చర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఆమె తన ‘టోయ్-ఎట్-మోయి స్టైల్’ ఎంగేజ్ మెంట్ రింగ్‌ను రెండు వేర్వేరు ఉంగరాలుగా డిజైన్ చేయించుకుంది. అంతేకాకుండా ‘‘ఉంగరాలు నా పర్సనల్ ఎవోల్యూషన్‌ను సూచిస్తాయి’’ అనే క్యాప్షన్ ఇవ్వడంతోపాటు ‘‘ఒక స్త్రీ, పురుషుడిని కోల్పోతున్నందుకు ఆమె తన నగలను తీసివేయాలని నేను అనుకోను’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా, ‘డివోర్స్ రింగ్స్’ ట్రెండ్‌పై క్రేజీ డిస్కషన్స్ నడుస్తు్న్నాయి.

వేడుకగా ఉంగరాల మార్పు

నిశ్చితార్థంలో లేదా పెళ్లిలో వధూ వరులు ఉంగరాలు మార్చుకోవడం ప్రిసద్ధ సంప్రదాయంగా వస్తోంది. పైగా ఈ రెండు వేడుకలను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ విడాకులను కూడా వేడుకగా జరుపుకోవడం, డివోర్స్ రింగ్స్ ధరించడం కూడా ఇప్పుడిప్పుడే ఒక సరికొత్త ట్రెండ్‌గా విస్తరిస్తోంది. ఒకప్పుడు భార్యా భర్తలు లేదా ప్రేమికులు విడిపోవడం, బ్రేకప్ చెప్పుకోవడం అంటే బాధాకరమైన అంశంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడది సంతోషకరమైన వేడుకకు నిదర్శనంగానూ మారుతోంది. ఈ క్రమంలోనే ‘డివోర్స్ రింగ్స్’ ధరించే సరికొత్త ట్రెండ్ పలువురిని ఆకర్షిస్తోంది.

మోడర్న్ కపుల్స్‌ కొత్త పోకడలు

వాస్తవానికి విడాకులు, బ్రేకప్ వంటివి బాధాకరమైనవి కాబట్టి వాటిని ప్రజలు సెలబ్రేట్ చేసుకోరు. కానీ ఇదంతా గతం. 2024లో విడాకులను కూడా ఒక వేడుకగా జరుపుకోవడం చాలా దేశాల్లో ప్రారంభం అయింది. ఎంగేజ్‌మెంట్ రింగ్స్, వెడ్డింగ్ రింగ్స్ మాదరి, డివోర్స్ రింగ్స్ కూడా జువెల్లరీ షాపుల్లో లభిస్తున్నాయి. మనసులో కాస్త బాధగా ఉన్నా విడిపోవడం ఖాయం అనుకున్నప్పుడు దానిని వేడుకగా జరుపుకోవడాన్ని మోడర్న్ కపుల్స్ అంగీకరించడమే కాకుండా పలువురు వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు.

రెండేళ్ల క్రితమే ఆ కాన్సెప్ట్

ఫేమస్ మోడల్ రతాజ్ కోవ్‌స్కీ ఇన్‌స్టా గ్రామ్‌లో సింబాలిక్ రింగ్స్‌ను ప్రదర్శించడం చర్చకు దారితీసింది. కానీ అంతకు ముందే వెస్ట్రన్ కంట్రీస్‌లో ‘డివోర్స్ రింగ్స్’ అనేవి ఒకపాపులర్ కాన్సెప్ట్‌గా ఉన్నాయి. న్యూయార్క్‌లోని అనేక జువెల్లర్ షాపుల్లో గత రెండు మూడేండ్ల నుంచి కస్టమర్ల కోసం బ్రేకప్ అండ్ డివోర్స్ జువెల్లరీస్ అందుటులో ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు. వైవాహిక బంధంలో సంతోషంగా లేనప్పుడు విడిపోవడం లేదా విడిపోకుండా సపరేట్‌గా ఉండటం కూడా వారికి సంతోషాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు డివోర్స్ లేదా సపరేషన్‌ను ఒక వేడుకగా ఎందుకు జరుపుకోవద్దు? అనేది దానిని సమర్థిస్తున్న వారి ప్రశ్న.

ట్రెండ్ వెనుక అసలు కథ

కొందరు ‘డివోర్స్ రింగ్స్‌’ధరించే ట్రెండును వ్యాపార ప్రయోజనంగా పరిగణిస్తుండవచ్చు. కానీ అది నిజం కాదంటున్నారు దీనిని సమర్థించే నిపుణులు. లోతుగా పరిశీలిస్తే ప్రజలు తమ విడాకులను గ్రహిండంలో, స్వీకరించడంలో వచ్చిన తెలివైన మార్పుగాగా పేర్కొంటున్నారు. కొందరు భాగస్వామి నుంచి వేధింపులు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్, హింస వంటివి ఎదుర్కొంటూ కూడా వివాహ బంధానికి కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితిలో మార్పు వస్తోందని చెప్తున్నారు. బ్యాడ్ రిలేషన్ షిప్స్‌కి డివోర్స్ కేక్‌కట్ చేయడం, రింగ్స్ ధరించడం వంటివి ఈరోజుల్లో ఆశ్చర్య పడాల్సిన విషయాలేం కావని, స్వాగతించాల్సిన మార్పేనని పలువురు పేర్కొంటున్నారు. పైగా ఈ నయాట్రెండును స్వీయ ప్రేమ, నిబద్ధత, ఆత్మగౌరవానికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed