బ్రా ఉతకకుండా ఎన్ని రోజులు వాడొచ్చు.. నిపుణులు చెప్తుంది ఇదే..

by Dishafeatures3 |
బ్రా ఉతకకుండా ఎన్ని రోజులు వాడొచ్చు.. నిపుణులు చెప్తుంది ఇదే..
X

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది ఒక్కసారి డ్రెస్ వేసుకోగానే వెంటనే వాష్ చేస్తారు. ఒక్కపూట వేసుకున్నా సరే కచ్చితంగా ఉతకాల్సిందే అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల దుస్తుల నాణ్యత దెబ్బతింటుందని.. త్వరగా పాడై పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పైగా దుస్తులను రిపీట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవని చెప్తున్నారు. ఏవి ఎన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చనే సమాచారాన్ని కూడా అందిస్తున్నారు.

1. డ్రాయర్, జిమ్ డ్రెస్ రోజూ ఉతకాలి. వాటిలోకి చెమట అధికంగా చేరుతుంది కాబట్టి వెంటనే ఉతకడం మంచింది.

2.ఇక అమ్మాయిల బ్రా విషయానికి వస్తే రెండు మూడు సార్లు వేసుకున్నాక ఒకసారి ఉతికితే సరిపోతుంది.

3. షర్ట్, బ్లౌస్ రెండు సార్లు వాడాక వాష్ చేస్తే సరి. వెదర్ కూల్ గా ఉంటే మరోసారి కూడా కంటిన్యూ చేయొచ్చు.

4. జీన్స్ ఆరు సార్లు వేసుకోవచ్చు. Levi's CEO ఏళ్ల పాటు ఒక్క జీన్స్ మెయింటైన్ చేశాడని సమాచారం. స్వెట్టర్, జాకెట్, బ్లేజర్ ఏడు సార్లు వేసుకోవచ్చు.

5. ఇక టవల్స్ మూడు రోజులకు ఒక సారి.. బెడ్ షీట్స్ వారానికి ఒక సారి శుభ్రం చేసుకుంటే చాలు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed