- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nita Ambani : ఇండియా హౌస్ ఆఫ్ పారిస్ ఒలింపిక్స్ నుంచి నీతా అంబాని న్యూ లుక్..
దిశ, ఫీచర్స్ : నీతా అంబానీ పారిస్ ఒలింపిక్స్‌లో భాగమైనప్పటి నుండి, ఆమెకు సంబంధించిన ఎన్నో క్లాస్ లుక్స్ బయటకు వస్తున్నాయి. కొన్నిసార్లు నీతా సూట్ ధరించి కనిపిస్తే మరికొన్ని సార్లు బ్లేజర్‌లో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నీతా మరోసారి తన పాత స్టైల్‌కి తిరిగి వచ్చి క్వీన్లీ చిక్‌ని చూపించింది. ఇండియా హౌస్ ఆఫ్ పారిస్ ఒలింపిక్స్ నుంచి నీతా కొత్త లుక్ రివీల్ చేశారు. కృష్ణ రంగు చీర ధరించి, సిగలో గులాబీలతో నీతా చాలా అందంగా కనిపిస్తున్నారు.
నీరజ్ చోప్రాను సన్మానిస్తూ..
నీతా అంబానీ తన చీరల ద్వారా భారతదేశంలోని చేనేత కార్మికులకు తరచుగా పని కల్పిస్తూ, కనుమరుగవుతున్న ఆనాటి కళా నైపుణ్యాలను ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ చేనేతను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు తాజాగా నీతా కృష్ణ రంగు చీరలో జావెలిన్ త్రో లో రజత పతకం సాధించినందుకు నీరజ్ చోప్రాను సత్కరించారు.
ఎంబ్రాయిడరీ..
నీతా ధరించిన చీర పై రీతూ కుమార్ కాంట్రాస్ట్ గోల్డెన్ థ్రెడ్‌లతో పాతకాలపు ఎంబ్రాయిడరీ చేశారు. అంచు విషయానికి వస్తే ఎరుపు రంగులో బంగారు జరీతో నేశారు. చీర మొత్తం జైపూర్ ప్రింట్ వంటి ముత్యాల్లాంటి చుక్కలతో ఉండగా అక్కడక్కడా బూటా డిజైన్ ఉంది. ఇక పల్లూకు గ్రాండ్ లుక్ ను అందించారు. రౌండ్ నెక్‌లైన్ బ్లౌజ్ స్లీవ్‌లు, నెక్‌లైన్‌పై గోల్డెన్ బార్డర్‌ను కలిగి ఉంది.
పర్ఫెక్ట్ డైమండ్ జ్యువెలరీ..
ఇక జ్యువెలరీ విషయానికి వస్తే డైమండ్ స్టడ్ చెవిపోగులు,చేతికి బ్రాస్లెట్, పెద్ద ఉంగరం ధరించారు. ఆమె మెడలో గోల్డ్ అండ్ ముత్యాల కాంబినేషన్ తో చేసిన చైన్, వజ్రాలు పొదిగిన లాకెట్ దాని క్రింద ముత్యాలు వేలాడదీసి ఉన్నాయి.
కొప్పులో గులాబీలు..
ఎప్పటిలాగే నీతా తన మేకప్‌ను సింపుల్‌గా ముగించారు. బ్రౌన్ ఐషాడో, కాజల్, మాస్కరా, చిన్న బింది, బ్లష్డ్ చీక్స్ నిగనిగలాడే పెదవులతో ఆమె లుక్‌తో పర్ఫెక్ట్‌గా కనిపించింది. హెయర్ స్టైల్ విషయాని వస్తే జుట్టును అందంగా పాపిట తీసి ముడివేసి ఎర్ర గులాబీని ధరించి స్టన్నింగ్ లుక్ ను సంతరించుకుంది.