Nindu Noorella Saavasam Serial: అమర్‌ను ఢీకొట్టిన భాగీ.. పర్సులో నుంచి కిందపడిన అరుంధతి తాళి!

by Vinod kumar |
Nindu Noorella Saavasam Serial: అమర్‌ను ఢీకొట్టిన భాగీ.. పర్సులో నుంచి కిందపడిన అరుంధతి తాళి!
X

దిశ, ఫీచర్స్: ఆర్మీ మేజర్గా కొడైకెనాల్లో భార్యాపిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు అమర్. తన మంచితనంతో ఇంట్లో అందరినీ ప్రేమగా చూసుకునే అరుంధతికి ఆర్జే భాగమతి అంటే చాలా ఇష్టం. ఆమె ప్రతి ప్రోగ్రామ్కి తానే ఫస్ట్ కాల్ చేసి సర్ప్రైజ్ చేసేది. అరుంధతితో బంధం భాగమతి మనసులోనూ చాలా సంతోషాన్ని నింపేది. తమ పెళ్లిరోజుకి కొడైకెనాల్ రమ్మని భాగమతికి టిక్కెట్లు పంపిస్తుంది అరుంధతి. కానీ పెళ్లిచూపుల్లో తనని కాదని అరుంధతిని పెళ్లి చేసుకున్నాడని అమర్ని ఎలాగైనా దక్కించుకోవాలని పగబడుతుంది మనోహరి. అందుకోసం అరుంధతిని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. పెళ్లిరోజునే అరుంధతిని చంపించేస్తుంది మనోహరి. పిల్లలు, అమర్ చనిపోయిన అరుంధతి కోసం బాధపడుతుంటే ఆ స్థానాన్ని తాను భర్తీ చేసే ఆలోచనల్లో ఉంటుంది.

అద్భుతమైన తారాగణంతో, ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకుందాం.. అమర్ పిల్లలు తమ కొత్త పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి చూసి అరుంధతి అడిగినట్టే నాన్నని ఏమైనా మర్చిపోయావా అని అడుగుతారు. పిల్లలందరూ అమర్కి చెప్పి స్కూల్కి బయలుదేరుతారు. ఆరు ఆత్మ పక్కనే నిలబడి ఉన్నా, కానీ అమర్ ఆమెని చూడలేకపోతాడు. మరోవైపు హాస్టల్లో ఉన్న భాగీకి సవతి తల్లి నుంచి డబ్బు పంపాలని ఫోన్లు వస్తూనే ఉంటాయి. చేసేదేంలేకతన బ్యాగులో దొరికిన తాళిని తాకట్టు పెట్టమని కరుణ సూచిస్తుంది. ఇష్టం లేకపోయినప్పటికీ తప్పక ఆ తాళిని తాకట్టు పెట్టడానికి కరుణను తీసుకుని బయలుదేరుతుంది.

మరుసటి రోజు ఉదయం 4 గంటలకు మనోహరి పిల్లలను నిద్రలేపి, వారిని సిద్ధం చేయమని బలవంతం చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత అమర్ జాగింగ్ కు వెళ్లి మరోసారి భాగీని ఢీకొడతాడు. వారిద్దరి మధ్య కాసేపు గొడవ జరిగాక ఇద్దరూ గొడవ ఆపేసి ఎవరి దారిన వారు వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. కానీ భాగీ బ్యాగ్ నుండి ఒక చిన్న ప్యాకెట్ కింద పడటం గమనిస్తాడు అమర్. దానిలోనుండి ఆరు తాళి బయటపడుతుంది. ఆ తాళి అరుంధతిదేనని అమర్ గుర్తుపడతాడా? భాగీకి అరుంధతి చనిపోయిన విషయం తెలిసిపోతుందా? తెలియాలంటే ఈరోజు, ఆగస్టు 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Advertisement

Next Story

Most Viewed