మురుగునీటిలో రంగును తొలగించే న్యూ పాలిమర్

by sudharani |
మురుగునీటిలో రంగును తొలగించే న్యూ పాలిమర్
X

దిశ, ఫీచర్స్ : వస్త్ర పరిశ్రమ లేదా ఇతర ఉత్పత్తి పరిశ్రమల నుంచి వెలువడే మురుగు నీటిని సమీప కాలువల్లోకి వదిలేస్తుంటారు. ఇలాంటి నీటిలో ఉండే Dye(రంగు) ప్రధాన కాలుష్య కారకాల్లో ఒకటిగా ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఓ సింథటిక్ పాలిమర్‌ను రూపొందించింది. ఇది నీటి నుంచి సదరు రంగును తొలగించడంతో పాటు శుద్ధిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

పరిశోధకుల బృందం.. ప్రయోగంలో భాగంగా రూపొందించిన పాలిమర్‌ను మొదట ద్రావకంలో కరిగించి, తర్వాత వస్త్ర పరిశ్రమలో సాధారణంగా ఉపయోగించే 20 రకాల యాసిడ్ డై కలిగిన కలుషిత నీటి నమూనాల్లో కలిపారు. ఇది 16 శాంపిల్స్ నుంచి రంగు మొత్తాన్ని విజయవంతంగా తొలగించగలిగింది. స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి నీటిని పరిశీలించిన పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు.

పాలిమర్‌ను డై మాలిక్యూల్స్‌తో బంధించడం ద్వారా అది ద్రావణం పైభాగాన ఒక ప్రత్యేక పొరను ఏర్పరుస్తుంది(నీటిపై నూనె పడినట్లు). దానిని కంటైనర్ నుంచి తీసేసిన తర్వాత రంగు రహిత నీటిని వదిలివేయొచ్చు. పాలిమర్, సాల్వెంట్ రెండూ నీటిలో కరగవు కాబట్టి వాటి జాడలు నీటిలో ఉండవని ప్రముఖ శాస్త్రవేత్త జానుక పేర్కొన్నాడు. రకరకాల రంగులపై పనిచేసే పాలిమర్‌కు సంబంధించిన ఇతర వెర్షన్స్ రూపొందించాలని వారి బృందం ప్లాన్ చేస్తోంది.

Advertisement

Next Story