- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుట్టు ఒత్తుగా పెరిగేందుకు వేప దువ్వెన.. ఎలా యూజ్ చేయాలంటే...
దిశ, ఫీచర్స్ : మార్కెట్ లో వేప దువ్వెనలకు భారీ డిమాండ్ ఏర్పడింది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలే ఇందుకు కారణం. కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం.. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన వేప.. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
రక్త ప్రసరణ
వేప దువ్వెనను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల తలపై రక్త ప్రసరణ జరుగుతుంది. హెయిర్ ఫోలికల్ యాక్టివిటీ పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
చుండ్రు నివారణ
వేప యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి ఇది చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, దురదలను నివారించేందుకు సహాయపడుతుంది. జుట్టు పెరగడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.
జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది
వేప దువ్వెన జుట్టు యొక్క బలం, పొడవును పెంచడంలో బాగా వర్క్ చేస్తుంది. చివర్లు చిట్లకుండా లేదా చీలిపోకుండా జుట్టును సున్నితంగా విడదీస్తుంది.
హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ
వేపలోని సహజ పోషకాలు స్కాల్ప్ కు బదిలీ అవుతాయి. హెయిర్ ఫోలికల్స్‌కు పోషణను అందించి.. జుట్టు ఒత్తుగా చేయడంలో సహాయపడుతుంది. కాలక్రమేణా బలమైన తంతువులు ఏర్పడుతాయి.
నో కెమికల్స్
వేప దువ్వెనలు సహజమైనవి. ఇందులో రసాయనాలు లేవు, వ్యర్థాలు లేవు. నకిలీ పదార్థాల నుండి ఎటువంటి నష్టం లేదు.
నేచురల్ ఆయిల్ బ్యాలెన్స్
వేప దువ్వెన జుట్టు అంతటా చర్మపు సహజ నూనెలను సమానంగా పంపిణీ చేస్తుంది. తేమ సమతుల్యతను కాపాడుతుంది, చింపిరి జుట్టును తగ్గిస్తుంది. మొత్తం ఆకృతిని మెరుగుపరుస్తుంది. గరిష్ట ఫలితాల కోసం ఈ వేప దువ్వెనను రోజూ వాడాలని సూచిస్తున్నారు. ఎప్పటికీ వినియోగించడం జుట్టు సాంద్రతను మెరుగుపరుస్తుంది. కాలక్రమేణా జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.