మృగశిర కార్తె ప్రారంభం.. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే?

by Jakkula Samataha |   ( Updated:2024-06-07 07:19:23.0  )
మృగశిర కార్తె ప్రారంభం.. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే?
X

దిశ, ఫీచర్స్ : రేపే మృగశిర కార్తె. రోహిణి కార్తె ముగియడంతో జూన్7నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. ఈరోజు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఎండలు తగ్గిపోయి, చిరు జల్లులు మొదలు అవుతాయి. వాతావరణం మొత్తం చల్లబడిపోతుంది. అంతే కాకుండా వర్షాలు కూడా పడటంతో, రైతులు ఆనందంగా తమ పంట పనులు మొదలు పెట్టుకుంటారు. నాగళ్లు పట్టుకొని పొలాన్ని దున్ని, పంట వేయడానికి రెడీ అవుతారు.

అయితే ఈ మృగశిరకు పేరు ఎలా వచ్చింది? దీన ప్రాముఖ్యతను తెలుసుకుందాం. రోహిణి కార్తె 15 రోజులు ఉంటుంది. ఈ పక్షం రోజులు పూర్తికాగానే, మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. ఇది పదిహేను రోజులు ఉంటుంది. ఇక చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో 14 రోజులు ఉంటాడు. ఏ నక్షత్రానికి ఆయన దగ్గరగా ఉండే ఆ కార్తెకు ఆ నక్షత్రం పేరు పెడుతారు. అలా మృగశిర నక్షత్రానికి చంద్రుడు చేరువలో ఉండటంతో దీనికి మృగశిర అనే పేరు వచ్చింది. ఇక ఈ కార్తె అంటేనే చల్లదనం.ఈ రోజుల్లో ప్రజలు ఆనందంగా ఉంటారు. రోకండ్లు పగిలే ఎండల నుంచి వర్షాలు మొదలు కావడంతో చల్లటి వాతావరణంతో ప్రజలు తమ పనులపై ఫోకస్ పెడుతారు. ఇక ఈ కార్తెను కొన్ని ప్రాంతాల్లో మిరుగు, మిర్గం, మృగం అని కూడా పిలుస్తారు. ఈరోజు బెల్లంలో ఇంగువ కలుపుకొని తింటుంటారు. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణంలో మార్పుడరావడంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో అనేక వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. వాటి నుంచి బయటపడటానికి బెల్లంలో ఇంగువ కలుపుకొని తినడం, చేపలు తినడం చేస్తుంటారు.

Advertisement

Next Story