- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రా ధరించిన పురుషులు.. అమ్మాయిల కంటే వీళ్లే బెటర్ అంటూ..!
దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళల్లోనూ అద్భుతమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వంటగదికే పరిమితమైన మహిళలు.. నేడు దేశాధ్యక్షులై ప్రపంచాన్నే ఏలే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మహిళలు రాణించని రంగమంటూ ఏదీ లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మోడలింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో కొన్ని విమర్శలు, కొన్నిచోట్ల అవమానాలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా.. ఇలాంటి పరిణామమే చైనాలో వెలుగూజూసింది. మహిళా మోడల్స్ లోదుస్తులు ధరించి చేసే వీడియోలపై నిషేధం విధించింది. లోదుస్తులు ధరించి శరీరాన్ని బహిరంగంగా చూపడం సరికాదని చైనా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే లోదుస్తులు ధరించిన మహిళా మోడల్స్ వీడియోలపై నిషేధం విధించింది.
ఈ చర్యలతో చైనాకు చెందిన కొన్ని లైవ్ స్ట్రీమ్ ఫ్యాషన్ కంపెనీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కస్టమర్లను ఆకర్షించడం పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు వినూత్నంగా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించాయి. మహిళల దుస్తువులను పురుషులకు వేసి.. పురుషులతో మోడలింగ్ చేయిస్తున్నాయి. మహిళలకు స్థానంలో పురుషులతో మహిళల లోదుస్తులను ధరింపజేసి మోడలింగ్ చేయిస్తున్నారు. ఇందుకోసం మేల్ మోడల్స్‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వారితో రకరకాల మహిళల లోదుస్తులను ధరింపజేసి ప్రదర్శనలు ఇప్పిస్తున్నాయి. తాజాగా.. పురుష మోడల్స్ లోదుస్తుల ధరించి పోజులు ఇస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. వీటికి సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. లైక్‌లు, కామెంట్లు పెట్టి రచ్చ చేశారు. నిజానికి మహిళల కంటే పురుషులే సరిగ్గా లో దుస్తులు ధరిస్తున్నారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. షేక్‌స్పియర్ కాలంలో ప్రకటనల్లో మహిళలకు బదులు పురుషులనే ఎంచుకున్నట్టు గుర్తుచేసుకుంటున్నారు.