- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సడెన్‌గా మాటలు తడబడుతున్నాయా?.. హైపోగ్లైసీమియా కావచ్చు !
దిశ, ఫీచర్స్ : ఉన్నట్లుండి సడెన్‌గా మాటలు తడబడుతున్నాయా? శరీరంలో వణుకు మొదలైందా? చెమటలు పడుతున్నాయా?.. అయితే ఇది లో బ్లడ్ షుగర్ వల్ల కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటిస్ పేషెంట్లలో చక్కెరస్థాయిలు బాగా తగ్గినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే జాగ్రత్త పడకపోతే కొన్నిసార్లు బాధితులు కోమాలోకి వెళ్లి ప్రాణహాని జరిగే చాన్స్ ఉంటుంది. అయితే రక్తంలో గ్లూకోజ్ లెవల్ నార్మల్ స్థాయికంటే పడిపోయినప్పుడు తలెత్తే ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియా అని, మరింత తీవ్రస్థాయిలో ఉంటే ఎక్స్‌ట్రీమ్ హైపోగ్లైసీమియా అని కూడా అంటారు.
ఎక్స్‌ట్రీమ్ హైపోగ్లైసీమియా పరిస్థితిలో మధుమేహం బాధితులు తీవ్ర గందరగోళంలో ఉంటారు. కళ్లు బైర్లు కమ్ముతుంటాయి. ఒళ్లు జలదరింపు లేదా తిమ్మిరి వంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. మాటల్లో తడబాటు, వణుకు, ఇతర నాడీ సంబంధిత లక్షణాలు సంభవిస్తాయని ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి మానవ మెదడు శక్తిని పొందటానికి శరీరంలోని గ్లూకోజ్ లేదా షుగర్ సరఫరాపై డిపెండ్ అవుతుంది. రక్తంలో అది ప్రమాదకర స్థాయికి పడిపోయినప్పుడు మెదడు సరిగ్గా స్పందించదు. సమయానికి ట్రీట్మెంట్ అందకపోతే ప్రాణహాని ఉంటుంది. అయితే రక్తంలో షుగర్ లెవల్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓరల్ యాంటీ డయాబెటిక్స్ (sulfonylureas) మెడికేషన్స్ ఎక్కువగా వాడాల్సి రావడం, సెప్సిస్, లివర్ అండ్ కిడ్నీ డిసీజెస్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, ట్యూమర్ లేదా కార్టిసాల్ వంటి హార్మోన్ల లోపాలు హైపోగ్లైసీమియాకు దారితీస్తాయి. ఇటువంటి రిస్క్ ఉన్న పేషెంట్లు మిస్ అవ్వకుండా ఇన్సులిన్ తీసుకోవడం, డైలీ వేళకు భోజనం చేయడం కొనసాగించాలి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. బయటకు వెళ్లినప్పుడు గ్లూకోజ్ పెంచే మాత్రలు, స్వీట్ వంటివి వెంటతీసుకెళ్లడం మంచిది. దీంతోపాటు వైద్య నిపుణుల సలహాలు తప్పకుండా పాటించాలి.