- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే జీవితం సర్వనాశనమే!
దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన దశ. గతంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు 15 ఏళ్ల లోపే పెళ్లి చేసేవారు. తర్వాత కాలంతో పాటు మార్పులు రావడంతో పెళ్లి విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు అమ్మాయికి చదువు ఎందుకు? స్త్రీ వంటింటికే పరిమితమన్న ఈ మాట.. ఇప్పుడు ప్రతి అమ్మాయికి చదువు, ఉద్యోగం తప్పనిసరి అంటున్నారు.
ఇక అబ్బాయిలు లైఫ్ లో చాలా గోల్స్ పెట్టుకుంటారు. అవి నెరవేరేవరకు పెళ్లి జోలికి వెళ్లరు. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగడానికి ఇదో కారణమని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా చాణక్యుడు పురుషులు, మహిళల జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. చాణక్య నీతిలో ఎలాంటి మహిళలను వివాహం చేసుకోకూడదో చెప్పుకొచ్చాడు.
వివాహనంతరం ఒక స్త్రీ తన భర్త, అతడి మొత్తం తరం సంతోషానికి బాధ్యత వహించాలి. ఒక కోడలిగా మాత్రమే అత్తారింట్లోకి అడుగుపెట్టకూడరు. కుటుంబ బాధ్యతలను వహించే స్త్రీగా రావాలి. ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. భార్య సత్ప్రవర్తన కలిగి ఉంటే ఇంట్లో ఆమె చెడు స్వభావం గల వ్యక్తిని కూడా మార్చగలదు. తన భర్త వైఫల్యాలను విజయాలుగా మార్చే శక్తి భార్యకు ఉందని నమ్ముతారు.
కానీ భార్య ప్రవర్తన సరిగా లేకుంటే.. కుటుంబంలోని ప్రతి సభ్యుడు దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుంది. భార్య ఎప్పుడు తన మాటలను నియంత్రించుకోవాలి. కఠినమైన పదాలను ఉపయోగించే భార్య తన భర్తకు హాని కలుగజేస్తుంది. ఇలాంటి భార్యతో మీరు తరచూ సమస్యల్లో పడతారు. కోపం రావడం సాధారణం. కానీ ఆ కోపాన్ని పక్కవారిపై చూపించకూడదు.
రెండు నిమిషాల కోపం వారి జీవితంపైనే ప్రభావం చూపుతుంది. తరచూ ఇంట్లో గొడవలు సృష్టించే భార్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణమున్న భార్య తమ పిల్లలకు మంచి లక్షణాలు నేర్పించలేదు. ఇంట్లో విషయాలు బయట మనుషులతో అస్సలు పంచుకోకూడదు. ఇలా చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది స్త్రీలు స్వలాభం కోసం చాలా అబద్ధాలు చెబుతుంటారు.
ఇలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేయడానికి కూడా వెనకాడరు. వారు మనశ్శాంతి కోల్పోవడమే కాకుండా భర్తలను కూడా హ్యాపీగా ఉంచలేరు. మరికొంతమంది మహిళలు డబ్బు పై మోజుతో చెడు దారుల్లో వెళ్తారు. డబ్బు, నగలు, వస్త్రాలు మొదలైన వాటితో వారి మనస్సు ఎప్పుడూ సంతృప్తి చెందదు. డబ్బుతో చాలా అనుబంధం ఉంటుంది. ఇలాంటి ఆశలు ఉన్న స్త్రీలు తప్పుదారిలో వెళ్లే అవకాశం ఉంటుందని చాణక్య నీతి చెబుతుంది.
Read More..
అక్కడ అన్నాచెల్లి పెళ్లి చేసుకుని పిల్లలను కంటున్న వైనం.. కారణమేంటంటే?