ప్రజాస్వామ్యానికి, ఓటరుకు పెళ్లి.. వైరల్ అవుతున్న ఎలక్టోరల్ వెడ్డింగ్ కార్డ్

by Disha Web Desk 6 |
ప్రజాస్వామ్యానికి, ఓటరుకు పెళ్లి.. వైరల్ అవుతున్న ఎలక్టోరల్ వెడ్డింగ్ కార్డ్
X

దిశ, ఫీచర్స్: లోక్‌సభ ఎన్నికల పోరు మొదలైంది. రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో ఎన్నికల సంఘం, సామాజిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నాయి. ఇందుకోసం సోషల్ మీడియాను వేదికగా వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో పూణేలో అవగాహన కల్పించేందుకు.. స్పెషల్ వెడ్డింగ్ కార్డ్‌ను డిజైన్ చేశారు సోషల్ వర్కర్స్. 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు.. 'ఓటర్', 'ప్రజాస్వామ్యం'కు జరగబోయేవివాహానికి హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు.

'ఎలక్టోరల్' వెడ్డింగ్ కార్డ్ డీటెయిల్స్ :

ఓటర్ - వరుడు & ప్రజాస్వామ్యం - వధువు వివాహానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. సోమవారం 13 మే 2024 నాడు, ఉదయం 7:00 నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు, పూణేలో లోక్‌సభ ఎన్నికల 2024 శుభ సందర్భంగా, భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం. కలలను సాకారం చేసే దిశగా ప్రకాశవంతమైన భారత్ కోసం వేసే అడుగు. మీ ఆశీర్వాదంతో ఈ జాతీయ పండుగను జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. మీ గొంతును ఓటు రూపంలో పార్లమెంటుకు పంపడానికి ఇదే అవకాశం.

వేదిక: మీ పోలింగ్ స్టేషన్. తేదీ & సమయం - 13 మే 2024, ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు. మీ ఓటు మా బహుమతి, అభివృద్ధి చెందిన భారతదేశం మీ రిటర్న్ గిఫ్ట్

Next Story

Most Viewed