Marriage benefits : పెళ్లి.. ఏ వయసులో చేసుకుంటే బెటర్ ?

by Javid Pasha |
Marriage benefits : పెళ్లి.. ఏ వయసులో చేసుకుంటే బెటర్ ?
X

దిశ, ఫీచర్స్ : ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి ఆమోదయోగ్యమైన అర్హతే పెళ్లి. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇది ముఖ్యమైన దశ. అయితే వివాహమనేది ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాలు, కుటుంబ నిర్ణయాలు, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది. చట్టం ప్రకారమైతే పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్ల వయస్సు కచ్చితంగా నిండి ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే చెల్లదు. కాగా ప్రస్తుతం చాలా మంది 18 నుంచి 40 ఏండ్ల మధ్య వివాహాలు చేసుకుంటున్నారు. మానసిక నిపుణుల ప్రకారం.. ఏ వయస్సులో పెళ్లి చేసుకోవడం మంచిది? మెరుగైన జీవితానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం.

21 నుంచి 30 ఏండ్ల మధ్య

నిజానికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య పెళ్లి చేసుకుంటే పరస్పరం అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. దీనివల్ల విడాలకు అవకాశం కూడా తగ్గుతుందని సైకాలజిస్టులు అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే తమ పిల్లలు కూడా వివాహానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేయడం ఉత్తమమని చెబుతున్నారు. దీనివల్ల వారి జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి. నేషనల్ సర్వే ఆఫ్ ఫ్యామిలీ గ్రోత్ స్టడీ ప్రకారం.. 32 ఏండ్లకంటే ముందే పెళ్లిళ్లు చేసుకున్న జంటల్లో విడాకులు 11 శాతం తక్కువగా ఉంటోంది.

30 నుంచి 40 ఏండ్ల మధ్య

కొందరు 30 నుంచి 40 ఏండ్ల మధ్య మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. కాగా అప్పటికే బంధువులు, తల్లిదండ్రులు, స్నేహితుల నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకోవడంవల్ల కూడా మంచి ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే అప్పటికే ఆర్థికంగా స్వతంత్రతను కూడా కలిగి ఉంటారు. పెళ్లి, జీవితం గురించి తగిన అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్‌లో జరిగే వివాహాల్లో కుటుంబ పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఈ రోజుల్లో మరీ ఆలస్యం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చాలామంది లేట్ మ్యారేజ్ వల్ల సంతానలేమి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి 34 ఏండ్లలోపు అయితే సంతానం, ఆరోగ్యం విషయంలో పెద్దగా సమస్యలు ఉండవు.

Advertisement

Next Story

Most Viewed