అంతరించనున్న పలు జీవజాతులు.. రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?

by Javid Pasha |
అంతరించనున్న పలు జీవజాతులు.. రాబోయే రోజుల్లో ఏం జరగనుంది?
X

దిశ, ఫీచర్స్ : భూమిపై మనుషులు, జంతువులు, చెట్లు ఇంకా అనేక రకాల జీవజాతులు మనుగడ సాగిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ ప్రపంచాన్ని జీవ వైవిధ్యానికి నిలయంగా పేర్కొంటున్నారు నిపుణులు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, ప్రతికూల పర్యావరణ ప్రభావాల కారణంగా పలు రకాల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నేచర్’కు చెందిన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే దశాబ్దంలో సుమారు 46 వేల జీవజాతులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తు్న్నారు.

ప్రకృతిని లోబర్చుకునే మానవ చర్యలు, వనరుల దుర్వినియోగం కారణంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్‌ జీవజాతులకు ముప్పు కలిగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు అడవుల నరికివేత, అక్రమవేట, పరాయి జాతుల చొరబాటు వంటివి జీవజాతుల మనుగడను ప్రశ్నార్థం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ సంవత్సరం అంతరించిపోయే జీవజాతుల జాబితా పెరుగుతూ వస్తోందని ఐయూసీఎన్ నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు, అవగాహనవల్ల ‘ఐబీరియన్ లిన్‌క్స్’ అనే అరుదైన కోతి జాతిని రక్షించగలిగామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయినప్పటికీ చిలీ దేశంలోని ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే గ్రాన్ కెనారియా తొండలు, బోర్నియా ఐస్‌లాండ్‌లో కనిపించే ఏనుగులు, చిలీ దేశంలోని అటకామా ఎడారిలో పెరిగే ఒక రకం బ్రహ్మజెముడు మొక్కలతోపాటు మరో 46,000 చిన్న చిన్న జీవజాతులు రాబోయే దశాబ్దాల్లో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. పర్యావరణ ముప్పును, గ్లోబల్ వార్మింగ్‌ను పెంచే చర్యలను అడ్డుకోవడం ద్వారానే జీవజాతి మనుగడ సాధ్యం అవుతుందని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed