వైద్యులకు షాక్.. ఒకే వృషణం, స్త్రీ జననేంద్రియాలతో వృద్ధుడు

by Disha News Desk |
వైద్యులకు షాక్.. ఒకే వృషణం, స్త్రీ జననేంద్రియాలతో వృద్ధుడు
X

దిశ, ఫీచర్స్ : 67 ఏళ్ల వృద్ధుడి కండిషన్ డాక్టర్స్‌కు షాకిచ్చింది. దశాబ్దాలుగా తన కాలు పై హెర్నియా గడ్డ ఉందని భ్రమపడిన వ్యక్తి.. ట్రీట్మెంట్ కోసం వైద్యులను సంప్రదిస్తే అసలు విషయం తెలిసింది. చాలా కాలంగా తన గజ్జల్లో వాపు ఉంటుందని చెప్పడంతో పరీక్షించిన వైద్యులు.. అతను ఒకే వృషణం తో పుట్టాడని గుర్తించారు. అంతేకాదు హెర్నియా అని భ్రమ పడుతున్న స్థానంలో స్త్రీ జననేంద్రియాలు ఉన్నట్లు ధృవీకరించారు. గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్‌తో పాటు అండాశయం ఉన్నట్లు స్పష్టం చేసిన డాక్టర్లు.. అదే ప్లేస్‌లో మరో వృషణాన్ని కూడా కనుగొన్నారు.

సదరు వ్యక్తి 'పర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్' సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడని, పురుషులు పురుషాంగం తో పాటు స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కూడా కలిగి ఉండటం అరుదైన పరిస్థితి అని పేర్కొన్నారు. వైద్య చరిత్రలో ఇలాంటి కేసులు ఇప్పటి వరకు 200 మాత్రమే నమోదైనట్లు వివరించారు. కాగా ఇందుకు సంబంధించిన వివరాలను ప్రిస్టినా యూనివర్సిటీ వైద్యులు యురాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు.

Advertisement

Next Story