గుండు గోకితే 'ట్రంప్' అయ్యాడు! ఓ అభిమాని వింత క్రాఫ్‌!! (వీడియో)

by Sumithra |
గుండు గోకితే ట్రంప్ అయ్యాడు! ఓ అభిమాని వింత క్రాఫ్‌!! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌న‌కున్న 64 క‌ళ‌ల్లో జూదం, ఇంద్ర‌జాలం, మ‌హేంద్ర‌జాలాదులే కాకుండా చివ‌రికి హ‌త్య‌లు చేయ‌డం కూడా ఉంది. కానీ, హెయిర్ క‌టింగ్ లేక‌పోవ‌డం ఎంతో బాధాక‌రం. డిప్ప క‌టింగ్ నుండి ఫార్మ‌ల్ క‌టింగ్ వ‌ర‌కూ, స్ట్రీట్ స్టైల్‌, మోటు స్టైల్ అంటూ 64 కంటే ఎక్కువ క‌టింగ్‌లే ఉన్నా క‌ళ‌ల జాబితాలో ఆదిమ శ‌కం నుండి ఆచ‌ర‌ణ‌లో ఉన్న‌ కేశాలంక‌ర‌ణ లేక‌పోవ‌డం క‌డు శోచ‌నీయం. అయినా, క‌ళ‌ను ఎవ్వ‌రూ ఆప‌లేరు. అలాగే, అభిమానాన్ని కూడా ఎవ్వ‌రూ ఆప‌లేరు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండకపోవచ్చు గానీ ఆయ‌న‌పై ఉన్న ప్రేమాభిమానాల‌ను అడ్డుకోవడం క‌ష్ట‌మే. దీన్నే ఓ అభిమాని ఎలా చూపించాడో చూడండి. కేశ‌క‌ళా కౌశ‌లంతో పాటు ట్రంప్‌పై వీరాభిమానాన్ని చూపించిన ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది.

అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని అయిన ఓ వ్య‌క్తి ట్రంప్‌ ముఖాన్ని తలపై షేవ్ చేసుకున్నాడు. గుండు గీకి చేసిన ఈ కేశాలతో చిత్ర‌లంక‌ర‌ణ అబ్బుర‌ప‌రిచేలా ఉంది. అయితే, సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అయిన‌ప్ప‌టికీ ఈ వీరాభిమానికి మాత్రం అనుకున్నంత ప్ర‌శంస‌లు అంద‌లేదు. స‌రిక‌దా, చాలా మంది ఏడ‌వాలో న‌వ్వాలో కూడా తెలియ‌ట్లేదంటూ త‌మ అస‌హ‌నాన్ని తెలియ‌జేశారు. మీమ్స్‌తో మోత మోగించారు.

Advertisement

Next Story

Most Viewed