ఓరినీ వీడికేం పోయేకాలం.. నడుస్తున్న కారుకు వేలాడదీసుకుని గలీజ్ పని చేస్తున్నాడే.. డేంజరస్ వీడియో వైరల్

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-31 15:58:38.0  )
ఓరినీ వీడికేం పోయేకాలం.. నడుస్తున్న కారుకు వేలాడదీసుకుని గలీజ్ పని చేస్తున్నాడే..  డేంజరస్  వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్: రోజూ ప్రమాదకర స్టంట్లతో ప్రాణాలు కోల్పోయిన వీడియోలు చూస్తూనే ఉన్నాం. కానీ యూత్ మాత్రం ఈ క్లిపింగ్స్ చూసినా మారడం లేదు. డేంజరస్ స్టంట్స్ చేసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే కదులుతున్న కారు డోర్‌కు తనను తాను వేలాడదీసుకున్న వ్యక్తి నవ్వుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముందు ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా.. మరో వ్యక్తి వెనుక సీట్‌లో నుంచి నవ్వుతుంటే.. టేప్‌తో వేలాడదీసుకున్న పర్సన్‌ కూడా స్మైల్ ఇస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో 90 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. మొత్తానికి ఈ డేంజరస్ స్టంట్‌ వైరల్‌గా మారగా.. కామెంట్స్ మరింత డేంజరస్‌గా ఉన్నాయి.

సుమిత్ కూల్ దుబే అనే ఎకౌంట్ నుంచి ఇన్‌స్టాలో ఈ వీడియో అప్‌లోడ్ కాగా.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై బూతులు కురిపిస్తున్నారు నెటిజన్లు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా.. ఎందుకు ఇంత నెగ్లిజెన్స్.. వీడికేమైనా పోయే కాలం వచ్చిందా అని తిట్టిపోస్తున్నారు. కాగా ఈ వీడియోపై పోలీసు శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది.

Advertisement

Next Story