- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తిన్న తర్వాత తల తిరుగుతోందా?.. పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ కావచ్చు
దిశ, ఫీచర్స్: భోజనం చేసిం తర్వాత మీకు తలగానీ, కళ్లుగానీ గిర్రున తిరుగుతున్నాయా? అది లో బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం అయ్యుండవచ్చు. చాలా రోజుల వరకు ఫుడ్ టైంకు తినకపోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు(low blood glucose levels) తగ్గడం కూడా ఇందుకు కారణం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మీకు భోజనం లేదా స్నాక్స్ తిన్న తర్వాత లైట్‌గా తలనొప్పి లేదా తల తిరగడం వంటివి స్టార్టయినప్పుడు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్‌గానే ఉంటుంది. లో బ్లడ్ గ్లూకోజ్ లెవల్, లో బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్ వంటి సమస్యలకు తీసుకునే మెడిసిన్ ప్రభావం అధికమైనప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్
భోజనం తర్వాత తలతిరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువ సేపు కూర్చున్న తర్వాత సడెన్‌గా చాలా ఫాస్ట్‌గా పైకిలేవడంవల్ల అలా జరగొచ్చు. బాడీలో ఫ్లూయిడ్ లెవల్స్, బ్లడ్ ఫ్లోలో ఆకస్మిక మార్పులవల్ల, కాంతి ఎక్కువగా ఉండే లైట్ల కింద తరచూ ఉండాల్సి రావడంవల్ల కూడా తలనొప్పి, తల తిరగడం, కళ్లు తిరగడం సమస్య రావచ్చు. పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్ (postprandial hypotension) అనే కండిషన్ కారణంగానూ భోజనం తర్వాత కళ్లు, లేదా తల తిరగడం వంటివి జరుగుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
మెదడులో రక్త ప్రసరణ తగ్గుతుంది
పోస్ట్‌ప్రాండియల్ (Postprandial) అనేది భోజనం తర్వాతి సమయంలో సంభవించే పరిస్థితిని సూచించే వైద్య పరిభాషలోని ఒక పదం. హైపోటెన్షన్ అంటే లో బ్లడ్ ప్రెషర్ (low blood pressure) పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్ (Postprandial hypotension) అంటే.. భోజనం తిన్న తర్వాత లో బీపీవల్ల తలతిరిగే పరస్థితి. ఈ సమస్య ఎక్కువగా వృద్ధులలో ఉంటుంది. లో బీపీ కారణంగా కళ్లు లేదా తల తిరిగి వెంటనే పడిపోయే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడటానికి మెదడు, శరీరం నుంచి రక్తం గట్‌కు ఫ్లో అయ్యే క్రమంలో మెదడులో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఈ కారణంగా లో బీపీ సమస్య ఎదురవుతుంది.
ఇవి పాటించండి
* భోజనానికి 30 నిమిషాల ముందు కనీసం 200 ml నీరు తాగాలి. అలాగే ఫుడ్ మితంగా తినడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తినడంవల్ల పోస్ట్‌ప్రాండియల్ హైపోటెన్షన్‌ను ప్రేరేపిస్తుంది. మీరు ఎక్కువగా ఆహారం తినాలనుకుంటే గనుక మధ్యలో గ్యాప్ ఇస్తూ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినొచ్చు కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం లోబీపీ సమస్యకు దారి తీస్తుంది.
* భోజనం చేసిన తర్వాత మీకు ఎక్కువగా తలతిరిగితే ఆ హైపోటెన్షన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి కొంతసేపు కూర్చోవడం లేదా పడుకోవడానికి ప్రయత్నించాలి. ఏ పొజిషన్‌లో పడుకుంటే లేదా కూర్చుంటే రిలాక్స్ అనిపిస్తే అలా చేయండి.
* తరుచూ శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సమతుల్య ఆహారం తీసుకోండి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి చేయాలి. తలతిరిగే సమస్య ఉన్నవారు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
ఇవి కూడా చదవండి :
ఖైదీలకు మెగా ఆఫర్.. వేశ్యను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి రిలీజ్