Love hormone : లవ్ హార్మోన్ అంటే ఏమిటి..? దీని ప్రయోజనాలేంటో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2024-10-16 16:01:29.0  )
Love hormone : లవ్ హార్మోన్ అంటే ఏమిటి..? దీని ప్రయోజనాలేంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : లవ్ హార్మోన్ గురించి మీరు వినే ఉంటారు. మెదడులోని పిట్యూటరీ గ్రంధి నుంచి ఇది రిలీజ్ అవుతుంది. అయితే దాని ప్రయోజనాలేమిటో తెలుసా?.. మానవ సంబంధాలను, భావోద్వేగ సాన్నిహిత్యాన్ని, సామాజిక పరస్సర చర్యలను ప్రోత్సహించడంలోనూ ఈ ఆక్సిటోసిన్ (Oxytocin) కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. హగ్ చేసుకున్నప్పుడు, పరస్పరం తాకినప్పుడు కొందరు చాలా సంతోషంగా కనిపిస్తుంటారు. అందుకు కారణం ఈ లవ్ హార్మోన్ రిలీజ్ కావడమే అంటున్నారు నిపుణులు.

స్నేహం, ప్రేమ, సానుభూతి, దయ వంటి భావాల వ్యక్తీకరణలో ఈ హార్మోన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రేమికులు లేదా దంపతుల మధ్య బంధం బలపడటంలో, అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య వాత్సల్యం పెంపొందడంలో ఇది సహాయపడుతుంది. ప్రసవం తర్వాత తల్లి తన బిడ్డకు పాలివ్వడం కారణంగా రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ తల్లి -శిశువు మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నిజానికి ఇదొక శక్తివంతమైన న్యూరోపెప్టైడ్‌గా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి వాటిని కలిపి ‘హ్యాపీ హర్మోన్స్’ అంటారు. ఒక వ్యక్తిపట్ల అట్రాక్ట్ అయినప్పుడు మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. అప్పుడు సెరోటోనిన్ (Serotonin) లెవల్స్‌తో పాటు సానుకూల భావోద్వేగాలు పెరుగుతాయి. ఈ క్రమంలోనే బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రేరణగా నిలిచే ఆక్సిటోసిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed