Kidnap : పన్నెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసే యత్నం.. నిందితులకు చుక్కలు చూపించి కాపాడిన సింహాలు..

by Sujitha Rachapalli |
Kidnap : పన్నెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసే యత్నం.. నిందితులకు చుక్కలు చూపించి కాపాడిన సింహాలు..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా సింహం మనిషిని ఆహారంగా తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురుచూస్తుంది. అడవి జంతువు కాబట్టి ఇది సహజమే. కానీ ఇదే యానిమల్ ఒక అమ్మాయిని కిడ్నాపర్ల నుంచి కాపాడింది. ఏకంగా నాలుగు సింహాలు ఆమె చుట్టూ నిల్చుని.. కాపలాగా ఉన్నాయి. 2005లో ఇథియోపియాలో ఈ ఘటన చోటు చేసుకోగా.. కోల్ కతా ఇన్సిడెంట్ కారణంగా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కాగా ఇథియోపియన్ నగరమైన బిటా జెనెట్‌లో పనిచేస్తున్న పోలీసు సార్జెంట్ వొండిము వెడాజో ఈ వివరాలను వెల్లడించారు. 12 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ఓ అబ్బాయి ప్రయత్నించగా.. ఇందుకు మరో ఆరుగురు హెల్ప్ చేశారు. ఆమెను కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్ళారు. ఒప్పుకోకపోతే వారం రోజులు దారుణంగా హింసించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళేసరికి మూడు సింహాలు ఆమె చుట్టూ కాపలా కాసినట్లు తెలిపాడు పోలీసు అధికారి. ఈ భయంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారని.. తాము పాప దగ్గరికి వెళ్లగానే సింహాలు అడవుల్లోకి వెళ్ళిపోయాయని చెప్పాడు. దాదాపు 12 గంటల పాటు సింహాలు తనకు కాపలాగా ఉన్నాయని బాలిక వివరించింది. కాగా ఈ జంతువులు తన పాపను రక్షించకపోతే రేప్ చేసి చంపేసేవారేమోనని బాధిత తల్లిదండ్రులు బాధపడ్డారు.

Advertisement

Next Story