- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kidney Health : కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలు తక్కువగా తినండి!
దిశ, ఫీచర్స్ : శరీరంలోని అతి ముఖ్యమైన అవయావాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని వడబోసి వ్యర్థాలను బయటికి పంపడంలో కీ రోల్ పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే అవి బాగున్నప్పుడే మొత్తం ఆరోగ్యం బాగుటుంది. అయితే ఈ మధ్య చాలామంది కిడ్నీల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. స్టోన్స్ చిన్నవిగా ఉన్నప్పుడు వైద్యుల సలహాతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రాళ్లు కరిగిపోవడమో, మూత్ర నాళం ద్వారా బయటకు వెళ్లిపోవడమో జరుగుతుంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది. కాబట్టి వాటిని తక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దాం.
*నాన్ వెజ్ : కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా చికెన్, రెడ్ మీట్ వంటివి తగ్గించాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా తినడంవల్ల యూరిక్ యాసిడ్ అధికంగా ప్రొడ్యూస్ అవుతుందని, మూత్రంలో సిట్రేట్ అనే కెమికల్ తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
*పొటాషియం రిచ్ ఫుడ్స్ : పొటాషియం కంటెంట్, అలాగే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నవారిలో ఆ సమస్యను మరింత అధికం చేస్తాయి. వాపు, మంటలను పెంచుతాయి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, అరటి పండ్లు, చిలగడ దుంపలు, టమాటాలు వంటివి తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే యాపిల్, బెర్రీలు, పైనాపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, క్యాబేజీ, బ్రోకోలీ, కాలిఫ్లవర్ వంటి కూరగాయలు తినడం మంచిది. అలాగే సోడాలు, కార్బొనేటెడ్ బేవరేజ్ అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగవద్దు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...
టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా..? ఈ సమస్యలు తప్పవు!